Posts

Showing posts from August, 2025

అంతర్జాతీయ సంబంధాల్లో కీలక పాత్ర పోషించ బోతున్న భారత్ ... ఉక్రెయిన్లో శాంతి కోసం మోడీకి జెలెన్‌స్కీ ఫోన్

Image
ఉక్రెయిన్‌ ( Ukraine ) అధ్యక్షుడు జెలెన్‌స్కీ ( Volodymyr Zelensky ), భారత ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi ) ల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ( Phone Conversation ) ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్లో శాంతిని పునరుద్ధరించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించాలని జెలెన్‌స్కీ కోరారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదని , ప్రపంచ శాంతికి సంబంధించిందని ఆయన మోడీతో అన్నారు. కాల్పుల విరమణే శాంతికి తొలి అడుగు : జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌లో యుద్ధం ( War ) తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ నెల రోజుల వ్యవధిలో రెండో సారి మోడీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. తక్షణమే కాల్పుల విరమణ కోసం రష్యాపై తేవాలని , షాంఘై సహకార సంస్థ ( Shanghai Cooperation Organization ) సదస్సులో ఈ విషయాన్ని ప్రస్తావించి రష్యాను ఒప్పించాలని కోరారు. ఉక్రెయిన్‌ నగరాలపై నిరంతర దాడులు జరుగుతున్నందున శాంతి చర్చలు సాధ్యం కావని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. యుద్ధం ఆగి పోవాలంటే కాల్పుల విరమణే మొదటి అడుగని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం ( PMO ) విడుదల చేసిన ప్రకటన మేరకు , ఈ సంభాషణలో జెలెన్‌స్కీ , అమెరికా అధ్యక్షుడు ...

భారత్, చైనా సంబంధాల్లో సరి కొత్త అధ్యాయం ... 7 ఏళ్ళ తర్వాత చైనాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ

Image
భారత్ , చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ( Narendra Modi ) శనివారం షాంఘై సహకార సంస్థ ( SCO ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలోని టియాంజిన్ నగరానికి చేరుకున్నారు. గత ఏడేళ్ల తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే తొలి సారి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 న జరిగే ఈ వార్షిక సదస్సులో పది దేశాల SCO ( Shanghai Cooperation Organisation ) కూటమి నాయకులను ఆయన కలవనున్నారు. ఇటీవల భారత్-( India) చైనా( Chaina ) సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆదివారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌( Xi Jinping ) తో ప్రధాని మోడీ జరపనున్న ద్వైపాక్షిక చర్చలు ఆశక్తి కరంగా మారాయి. ఈ భేటీపై ప్రపంచ దేశాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అలాగే , సెప్టెంబర్ 1 న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ( Vladimir Putin ) తో కూడా ప్రధాని మోడీ చర్చలు జరపనున్నారు. అమెరికాతో భారత్ సంబంధాలు కొంత ఇబ్బంది కరంగా మారిన నేపధ్యంలో మోడీ చైనాలో పర్యటిస్తున్నారు. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న నెపంతో , ట్రంప్ ( Donald Trump ) ప్రభుత్వం భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలు విధించింది. దీంతో అమెరికాతో భార...

సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీల తుది ఓటర్ జాబితా ... ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ

Image
సెప్టెంబర్ 2 న వార్డుల వారిగా గ్రామ పంచాయతీల తుది ఓటర్ జాబితాను ప్రకటించనున్నట్లు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ చెప్పారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పి. శ్రీజ స్థానిక సంస్థల ఎన్నికలకు వార్డుల వారిగా డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరోల్ గ్రామ పంచాయతీ , మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ నెల 28 న ప్రదర్శించామన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కూడా కసరత్తు చేశామన్నారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 లోగా సంబంధిత ఎంపిడివోకు తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 31న పరిష్కరింస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు సహకరించాలి ... ఈ నెల 30న మండల స్థాయి సమావేశాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ ఈ సందర్భంగా కోరారు. జిల్లాలో 571 గ్రామ పంచాయతీలకు గాను 5, 214 వార్డులు ఉన్నట్లు తెలిపారు. 8 లక్షల 2, 690 ఓటర్లకు 5, 214 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 3...

ఈ పని చేయండి ... ప్రధాని మోడీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ విజ్ఞప్తి

Image
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ( Subhas Chandra Bose  ) అస్థికలను భారతదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ( Anita Bose Pfaff )   ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నందున , ఈ అభ్యర్థన ప్రాధాన్యత సంతరించుకుంది. తన వయసు మీద పడుతున్నందున , ఈ సమస్యకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని ఆమె కోరారు.  ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్న 82 ఏళ్ల అనితా బోస్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ , ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తే , తన తండ్రి అస్థికలను స్వదేశానికి తీసుకు రావాలని కచ్చితంగా కోరతానన్నారు. "గతంలో పీవీ నరసింహా రావు ప్రభుత్వం నా తండ్రి అస్థికలను తీసుకురావడానికి ప్రయత్నించింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలి. నా వయసును దృష్టిలో ఉంచుకుని ఈ పని చేయాలని ఆమె కోరారు. 

బీఆర్ఎస్ కు ఓటేయడమంటే ... అభివృద్ధికి వేయడమే : ఎంపీ వద్ధిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు

Image
బీఆర్ఎస్ కు ఓటేయడమంటే ... అభివృద్ధికి వేయడమేనని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ , బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు సూదన్ అన్నారు. గురువారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు , మాజీ శాసన సభ్యులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ , అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని నాయకులు , కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ముఖ్యంగా దళిత బంధు , రైతు బంధు , ఆరోగ్యశ్రీ , కల్యాణ లక్ష్మి , శాది ముబారక్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పులను హైలైట్ చేయాలని సూచించారు.  అదే విధంగా , యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ , వారిని పార్టీ కార్యకలాపాల్లో భాగస్వాములును చేయాలన్నారు. సోషల్ మీడియా వేదికలల్లో పార్టీ విజయాలను ప్రజలకు చెప్పాలని , పార్టీపై , కేసీఆర్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేస్తే , ఎన్నికల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధించగల...

నీలి రంగు కోడి గుడ్డును ఎప్పుడైనా చూశారా ? ... మరి ... ఆ గుడ్డు ఎక్కడుందో తెలుసుకోండి ... !

Image
కర్ణాటకలోని ఓ కోడి నీలి రంగు గుడ్డు పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. సాధారణంగా గుడ్లు తెలుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటాయి. కానీ , దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా నెల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు పెంచుతున్న కోడి ఇలా వింతగా నీలి రంగు గుడ్డు పెట్టింది. రెండేళ్ల క్రితం సయ్యద్ నూర్ ఒక కోడిని రూ. 20 పెట్టి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అది తెల్ల గుడ్లు పెట్టేది. అయితే , ఇటీవల అనూహ్యంగా నీలి రంగు గుడ్డును పెట్టింది. ఈ విషయం తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆ గుడ్డును చూడటానికి వస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారు  ? పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ అశోక్ దీనిపై స్పందిస్తూ , " కోడి క్లోమంలోని ' బైలివర్డిన్ ' అనే వర్ణ ద్రవ్యం వల్ల అరుదుగా ఇలా జరుగుతుంది" అని తెలిపారు. మరో పశు వైద్య అధికారి డాక్టర్ రఘు నాయక్ మాట్లాడుతూ , " గుడ్డు పై పొర నీలం రంగులోకి మారడానికి ఈ వర్ణ ద్రవ్యమే ప్రధాన కారణం. కొన్ని సార్లు జన్యుపరమైన సమస్యలు లేదా కోడి తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంది" అని వివరించారు. అసలు నీలి గుడ్లు ఎందుకు వస్తాయి  ?...

అమెరికా పట్ల భారత్ వైఖరిలో మార్పులు ... మోదీ వ్యూహాత్మక మౌనం వెనుక మర్మమేంటి ?

Image
గత కొద్ది కాలంగా భారత్ , అమెరికా సంబంధాలు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఒకప్పుడు "ప్రపంచంలోనే అత్యంత కీలకమైన భాగస్వామ్యం" అని చెప్పుకున్న ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం విధానపరమైన విభేదాలు , వాణిజ్య యుద్ధం తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల అనుసరిస్తున్న విధానాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని , ట్రంప్ ఫోన్ కాల్స్ ను కూడా నిరాకరించారని జర్మనీకి చెందిన ప్రముఖ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనం భారతీయ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ పట్ల మోదీ వ్యూహాత్మక మౌనం జర్మన్ వార్తాపత్రిక "ఫ్రాంక్‌ ఫర్టర్ ఆల్గేమైన్ జైతుంగ్" మరియు జపాన్ వార్తాపత్రిక "నిక్కీ ఆసియా" ప్రచురించిన కథనాల ప్రకారం , అమెరికా విధించిన భారీ సుంకాల (టారిఫ్) విషయంలో చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానికి పలు మార్లు ఫోన్ చేసినా , మోదీ అందుబాటులోకి రాలేదు. అయితే , ఈ కథనాల ప్రకారం , మోదీ ఈ కాల్స్‌ను నిరాకరించడం వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య వివాదంపై ఆగ్...

రాజీవ్ స్వగృహ ప్లాట్లు ప్రభుత్వ ఉద్యోగులకే .. రూ. 2 లక్షలు చెల్లిస్తే పేరు రిజిస్టర్... ప్లాట్ ధర రూ. 28 లక్షలే

Image
ఖమ్మం మున్నేరు ఒడ్డున వున్న రాజీవ్ స్వగృహలో ( జలజ టౌన్ షిప్ ) ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 30 లోపు 2 లక్షల రూపాయలు చెల్లించి పేరు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ , రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్ రెడ్డిలతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ స్వగృహపై సంబంధిత అధికార్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును 9 ఎకరాల 22 గుంటలలో నిర్మించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టులోని 8 టవర్లలో అసంపూర్తిగా ఉన్న 576 ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.  వీటి ధర గజం 1150 రూపాయల చొప్పున నిర్ణయించామన్నారు. ఇక్కడ ఉన్న 8 టవర్లు ఉద్యోగులకు లాటరీ పద్ధతిన కేటాయిస్తామన్నారు. సొంత ఇళ్ళు కావాలని ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ లాటరీలో పాల్గొని తమ కలను నెరవేర్చుకోవాలని సూచించారు. రివర్ వ్యూతో టవర్స్ బాగా ఉన్నాయని , త్వరగా అభివృద్ధి జరిగే ప్రాంతంలో ఈ టవర్లు ఉన్నాయని తెలిపారు. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి...

మారణాయుధంతో భార్యపై భర్త దాడి

Image
కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త మారణాయుధంతో భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన మధిర మండలంలోని మాటూరు గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగినట్లుగా తెలుస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిల్ల సూర్యనారాయణ ప్రైవేట్ లారీ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం విధులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సూర్యనారాయణ , భార్య సాయి నాగలక్ష్మి   ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సూర్యనారాయణ చేతికి దొరికిన మారణాయుదంతో ఆమెపై దాడికి దిగాడు. దీంతో నాగలక్ష్మి మెడపై బలమైన గాయమైంది. ఆమె కేకలు వేసుకుంటూ ఇంట్లో నుండి రోడ్డుపైకి వచ్చి కింద పడి పోవడంతో స్థానికులు 108 అంబులెన్స్ లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మెడపై బలమైన గాయంతో తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఇప్పుడు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మధిర రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉండగా , ప్రస్తుతం నాగలక్ష్మి...

రాజీవ్ స్వగృహ విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం ... సెప్టెంబర్ 8న లాటరీ పద్దతిలో కేటాయింపు

Image
ఖమ్మం మున్నేరు ఒడ్డున ఏదులా పురం మున్సిపాలిటీ పరిధిలో అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును( జలజ టౌన్ షిప్ ) ఉన్నది ఉన్నట్లుగా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే , ఇప్పుడు నిర్మాణానికైన ఖర్చుతోనే బహుళ అంతస్తుల సముదాయంతో ఉన్న ఈ ప్రాజెక్టు మొత్తాన్ని లాటరీ ద్వారా విక్రయించనున్నారు. జూలై 22న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబరు 8న లాటరీ పద్దతిలో ఈ ప్రాజెక్టును కేటాయిస్తారు. వివిధ సహకార సంఘాలు , ఉద్యోగ సంఘాలు , బిల్డర్లు , డెవలపర్లు , జాయింట్ వెంచర్లు ... ఇలా గ్రూప్ హౌసింగ్ పథకాలపై ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 9.22 ఎకరాల్లో నిర్మాణం ... చదరపు అడుగు రూ. 1150 సుమారు 9.22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఎనిమిది బ్లాకులు , తొమ్మిది ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లోర్లో 8 ఫ్లాట్లతో ప్రాజెక్టు మొత్తం మీద 576 ఫ్లాట్లు ఉన్నాయి. వీటి నిర్మాణ పనులు వివిధ దశల్లో అసంపూర్తిగా మిగిలి పోయాయి. ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా 60 అడుగుల అప్రోచ్ రోడ్డు మంజూరై పనులు కొనసాగుతున్నా...

రెండో సారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఎన్నిక

Image
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తిరిగి ఎన్నికయ్యారు. గత మూడు రోజులుగా మేడ్చల్ జిల్లాలోని గాజుల రామవరంలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర నాలుగవ మహాసభలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కూనంనేని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం ఇది రెండో సారి. తొలుత పాత్రికేయునిగా పని చేసి , కొత్తగూడెంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆయన అంచె లంచలుగా ఐదు దశాబ్దాల పాటు పార్టీలోని వివిధ హోదాల్లో పని చేశారు. సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా , కొత్తగూడెం శాసన సభ్యునిగా గతంలో పని చేశారు. ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కూనంనేని తిరిగి రెండవ సారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మొదటి నుండి ఆయన ప్రజలు , కార్మికులు , కర్షకులు , ప్రధానంగా సింగరేణి కార్మికుల పక్షాన పోరాడారు. అనేక ఉద్యమాల్లో పోలీసుల లాఠీ దెబ్బలు తిని , అరెస్టయ్యారు. అటువంటి ఉద్యమ నేత కూనంనేని , పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి ఎన్నిక కావడం పట్ల పలువురు హర్ష వ్యక్తం చేస్తున్నారు.    

కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మాణానికి డిజైన్లు రెడీ

Image
కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నిర్మించేందుకు డిజైన్లు రెడీ అయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదంతో త్వరలో నిర్మాణ పనులు కూడా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమౌతోంది. ప్రముఖ ఆర్కిటెక్ ఉష రూపొందించిన యూనివర్సిటీ నిర్మాణ నమూనాలను శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సచివాలయంలోని తన చాంబర్లో యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ యోగితా రాణా , ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుతంగా ఈ యూనివర్సిటీ ప్రణాళికను రూపొందించాలని అధికార్లను ఆదేశించారు. ప్రపంచంలోనే అద్భుతమైన నిర్మాణంగా ఇది నిలిచి పోవాలన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం , అన్ని మౌళిక సదుపాయాలతో ఈ యూనివర్సిటీని నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం జరగాలన్నారు. విద్యార్థులు , లెక్చరర్లకు అసౌకర్యం కలగకుండా విశాలమైన  తరగతి గదులు , హాస్టళ్లు , గ్రంథాలయాలను నిర్మించాలన్నారు. ఆర్కిటెక్ తయారు చేసిన డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపించి , ఆయన ఆదేశాలకు అనుగుణంగా డ...

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం ... 3వ ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ఉధృతి

Image
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 53 అడుగులకు చేరువలో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి ఈ సాయంత్రం 5 గంటల వరకు 51.90 అడుగులకు చేరుకుంది. నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంటే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం 13 , 66 , 298 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరికి ప్రమాదకర స్థాయిలో వరద రావడంతో అధికార్లు నదీ పరీవాహక ప్రాంత  ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ ఏడాది గోదావరికి ఇంత వరద రావడం ఇదే మొదటి సారి. దీంతో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షించి , అధికార్లకు తగిన సూచనలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , ఎస్పీ రోహిత్ రాజ్ తో ఫోన్లో మాట్లాడి ఎగువ నుండి వరద ఎక్కువగా వుండడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా , భద్రాచలంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రామాలయం టెంపుల్ వద్ద గల కరకట్ట , స్లూయిస్ కాలువ , కునవరం రోడ్లో నూతన కరకట్ట ప్రాంతాల్లో పర్యటించి గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి , గోదావరి వరద నీరు పట్టణంలోకి రాకుండా ...

వైరా రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతాం ... కలెక్టర్ అనుదీప్

Image
వైరా రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సంబంధిత అధికార్లను ఆదేశించారు. సందర్శకుల సౌకర్యార్ధం పర్యాటక ప్రాంతాల్లో మౌళిక వసతులు కల్పించాలన్నారు. బుధవారం ఆయన వైరా నియోజక వర్గ కేంద్రంలోని రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని గుట్టలను , బోటింగ్ ప్రాంతాన్ని , ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మత్స్య విత్తన క్షేత్రాన్ని కలెక్టర్ అనుదీప్ తనిఖీ చేశారు. విత్తన కేంద్రంలోని మౌళిక వసతులను పరిశీలించారు. కేంద్రంలో పిచ్చి మొక్కలను , చెత్తను తొలగించాలని , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికార్లను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప్రాంతాన్ని టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. బోటింగ్ , కాటేజ్ గదులు , బిల్డింగ్ మరమ్మత్తులకు ప్రతిపాదనలు అందజేయాలని అధికార్లను ఆదేశించారు. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడం కోసం చేప పిల్లలు సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మత్స్య శాఖ ఎడీ...

ఈ నెల 22 న గ్రామాల్లో పనుల జాతర

Image
ఖమ్మం జిల్లాలో ఈ నెల 22న పనుల జాతర- జరగనుంది. ఒకే రోజు 20 మండలాల పరిధిలోని 571 గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు , ప్రారంభోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు ఈ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే , ఇప్పటికే పనుల జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఈ జాతరలో భాగంగా ఉపాధి హామీ పథకం , ఆర్.డబ్ల్యూ.యస్ , పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ , స్వచ్ఛ భారత్ వంటి విభాగాల్లో చేపట్టిన , చేపట్టనున్న పనులను చేపడతారు. అలాగే , నూతన గ్రామ పంచాయతీ , అంగన్వాడీ భవనాలు , స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ద్వారా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్లు , కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్సులు , ఇందిరా మహిళా శక్తి – ఉపాధి భరోసా క్రింద వ్యక్తిగత ఆస్తుల కల్పన , పశువుల కొట్టాలు ,   కోళ్ళ , గొర్రెల షెడ్లు , పండ్ల తోటలు , వాన పాముల ఎరువుల తయారీ , అజోలా పిట్ నిర్మాణాలు , జలనిధి క్రింద వాన నీటి సంరక్షణ , -భూగర్భ జలాలు పెంచే ఫారమ్ పాండ్స్ , ఊట కుంటలు వంటి పనులను చేపడతారు. అంతే కాకుండా , ఉపాధి హ...

డీజే పెడితే కేసులే ... యజమానులకు వైరా పోలీసుల హెచ్చరిక

Image
డీజే శబ్దాల నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వైరా సీఐ నునావత్ సాగర్ , ఎస్సై పుష్పాల రామారావు హెచ్చరించారు. త్వరలో జతగనున్న గణేశ్ ఉత్సవాల నేపధ్యంలో మంగళవారం వైరా మండలంలోని డీజే యజమానులతో మాట్లాడారు. వారందరికీ వైరా పోలీస్ స్టేషన్లో డీజే శబ్దాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ఈ సందర్భంగా వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. శుభాకార్యలతో పాటు మతపరమైన ఊరేగింపుల్లో మైకులు మినహా శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా నిషేదించాలని ఆదేశించారు. డీజేల వల్ల పెరిగే శబ్ద కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై , ముఖ్యంగా వృద్ధులు , పిల్లలపై ప్రతి కూల ప్రభావం చూపుతుందనన్నారు. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం వుందన్నారు. అందువల్ల అందరూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు.

యూరియా కొరత లేదు ... ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు : ఖమ్మం కలెక్టర్ అనుదీప్

Image
ఖమ్మం జిల్లాలో సమృద్ధిగా యూరియా అందుబాటులో ఉందని , ఎక్కడా రైతులు ధర్నా చేయాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. యూరియా అందుబాటులో ఉన్నా , కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేసి రైతులతో ధర్నా చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో అవసరం ఉన్న చోట స్టాక్ కేటాయించి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం ఆయన ఖమ్మం కలెక్టరేట్లోనీ తన ఛాంబర్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో యూరియా లభ్యత , సరఫరాపై సంబంధిత జిల్లా , మండల వ్యవసాయ అధికారులు , ఏఈఓలు , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు , మార్క్ ఫెడ్ అధికారులు , పోలీస్ అధికార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గత ఏడాది కంటే , ఈ ఏడాది ఇప్పటి వరకు 3 , 250 మెట్రిక్ టన్నుల యూరియా ఆధనంగా రైతులకు సరఫరా చేసామని తెలిపారు. ప్రస్తుతం 2 , 700 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని , రైతులు అనవసరంగా గందరగోళానికి గురి కావద్దన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తన పరిధిలోని రైతులు ఒకే సారి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశి...

సీసీ కెమెరాలతో ఆకేరు, మున్నేరు వరద ఉధృతిపై నిఘా

Image
గత ఏడాది ఆకస్మికంగా వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు అధికార్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆకేరు వాగుపై తిరుమలాయ పాలెం మండలంలోని తిప్పారెడ్డి గూడెం , మున్నేరుపై డోర్నకల్ , ఖమ్మంలోని కాల్వ ఒడ్డు వద్ద సోలార్ డే అండ్ నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ , కలెక్టర్ ఛాంబర్ కు అనుసంధానం చేసి , 24 గంటల పాటు నీటి ప్రవాహ ఉధృతిని అంచనా వేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులను ముందుగా అంచనా వేసి , అవసరమైతే ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు , పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తన ఛాంబర్ నుండి కెమెరాలతో వరద ఉధృతిని అంచనా వేశారు. అధికారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటికే మున్నేరు , ఆకేరు నదుల పరివాహక ప్రాంతాల అధికారుల నుండి వర్షం , వరద పరిస్థితిపై సమాచారం సేకరిస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో అధికారులు ...

మధిర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలి : అధికార్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

Image
మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో , వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లో మధిర పట్టణ సమగ్ర అభివృద్ధిపై సమీక్ష జరిపారు. నెలకు ఒక సారి మున్సిపల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ( ENC),   ప్రతి 15 రోజులకు సీఈ స్థాయి అధికారులు విధిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించాలన్నారు. వారం , 15 రోజులు ,   నెల రోజుల వ్యవధిలో టార్గెట్లు నిర్దేశించుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను మధిర పట్టణ ప్రజలకు తెలియ జేయాలని , ప్రజలకు అవగాహన కల్పించడంలో స్థానిక వార్డు కౌన్సిలర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మమైన ఈ ప్రాజెక్టు పనులపై తాను తరచూ సమీక్ష చేస్తానని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు అందుతున్నప్పటికీ , భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా జాలి మూడి నుంచి మధిర పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ వైకుంఠ దామం తరహాలో మధిర వైక...

భద్రాద్రి రాముని సాక్షిగా ... ఈ నెల 21న ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశం : మంత్రి పొంగులేటి

Image
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ళు ప్రారంభం లక్ష మందితో ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవం బెండలం పాడులో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి భద్రాద్రి రాముని సన్నిధిలో గతంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పథకాన్ని ప్రారంభించి , అదే నేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశాలు జరుపు కోవడం ఒక చారిత్రక ఘట్టమని తెలంగాణ రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలోని బెండలం పాడులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై అధికార్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బెండలం పాడు గ్రామానికి మొత్తం 312 ఇండ్లు మంజూరు కాగా , వాటిలో 72 ఇండ్లు పూర్తయ్యాయని , వాటిలో 27 ఇండ్లకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గృహ ప్రవేశం జరుగుతుందన్నారు. ఈ గృహ ప్రవేశ మహోత్సవానికి సుమారు ఒక లక్ష మంది ప్రజలు హాజరవుతారని తెలిపారు. గడిచిన పదేళ్ళలో పేద వాడి సొంత ఇంటి కల కలగానే మిగిలి పోయిందన్నారు. అయితే , ముఖ...

పెసర రైతులను ఆదుకోండి ... మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి డిమాండ్

Image
ఖమ్మం జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నష్ట పోయిన పెసర రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి ( Banoth Chandravathi ) డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన వర్షాలకు పెసర రైతులు బాగా నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. ఆదివారం ఆమె వైరా నియోజక వర్గంలోని కొణిజర్ల మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాణోత్ చంద్రవతి మాట్లాడుతూ అనేక చోట్ల వర్షాలకు పెసర ( Green Gram ) పంట కుళ్ళి , బూజు పట్టి పోయిందన్నారు. ఇది చూసిన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని , వారిని ఆదుకొనేందుకు తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి , నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే , రైతులకు పంటల భీమాను కూడా అమలు చేయాలన్నారు. పంటల బీమాను అమలు చేస్తే , పంటలు నష్ట పోయిన రైతులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా చంద్రావతి పేర్కొన్నారు. ఈ పర్యటనలో పలువురు రైతులు , బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.