డీజే పెడితే కేసులే ... యజమానులకు వైరా పోలీసుల హెచ్చరిక
డీజే శబ్దాల నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వైరా సీఐ నునావత్ సాగర్, ఎస్సై పుష్పాల రామారావు హెచ్చరించారు. త్వరలో జతగనున్న గణేశ్ ఉత్సవాల నేపధ్యంలో మంగళవారం వైరా మండలంలోని డీజే యజమానులతో మాట్లాడారు. వారందరికీ వైరా పోలీస్ స్టేషన్లో డీజే శబ్దాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ఈ సందర్భంగా వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. శుభాకార్యలతో పాటు మతపరమైన ఊరేగింపుల్లో మైకులు మినహా శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా నిషేదించాలని ఆదేశించారు. డీజేల వల్ల పెరిగే శబ్ద కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలపై ప్రతి కూల ప్రభావం చూపుతుందనన్నారు. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం వుందన్నారు. అందువల్ల అందరూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు.

Comments
Post a Comment