కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మాణానికి డిజైన్లు రెడీ

మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ

కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నిర్మించేందుకు డిజైన్లు రెడీ అయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదంతో త్వరలో నిర్మాణ పనులు కూడా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమౌతోంది. ప్రముఖ ఆర్కిటెక్ ఉష రూపొందించిన యూనివర్సిటీ నిర్మాణ నమూనాలను శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సచివాలయంలోని తన చాంబర్లో యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ యోగితా రాణా, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుతంగా ఈ యూనివర్సిటీ ప్రణాళికను రూపొందించాలని అధికార్లను ఆదేశించారు. ప్రపంచంలోనే అద్భుతమైన నిర్మాణంగా ఇది నిలిచి పోవాలన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్ని మౌళిక సదుపాయాలతో ఈ యూనివర్సిటీని నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం జరగాలన్నారు. విద్యార్థులు, లెక్చరర్లకు అసౌకర్యం కలగకుండా విశాలమైన  తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయాలను నిర్మించాలన్నారు. ఆర్కిటెక్ తయారు చేసిన డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపించి, ఆయన ఆదేశాలకు అనుగుణంగా డిజైన్లకు ఆమోదం తీసుకోవాలని అధికార్లకు సూచించారు.  సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

Thummala Nageswara Rao

3 ఏళ్ళలో నిర్మాణం పూర్తి చేయాలి  

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల భద్రాద్రి కొత్తగూడం కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాలలోనే తాత్కలికంగా తరగతులు నిర్వహించాలని, హాస్టల్ భవనాలకు మరమ్మత్తులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. 3 సంవత్సరాలలో యూనివర్సిటీ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశంలోనే మొట్ట మొదటి యూనివర్సిటియని చెప్పారు. ఇది 300 ఎకరాల విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకోని, అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలకు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ ద్వారా వేలాది మంది యువ శాస్త్ర వేత్తలు దేశ భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఏర్పడుతుందని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే