రెండో సారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఎన్నిక

Kunamneni Sambashiva Rao

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తిరిగి ఎన్నికయ్యారు. గత మూడు రోజులుగా మేడ్చల్ జిల్లాలోని గాజుల రామవరంలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర నాలుగవ మహాసభలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కూనంనేని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం ఇది రెండో సారి. తొలుత పాత్రికేయునిగా పని చేసి, కొత్తగూడెంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆయన అంచె లంచలుగా ఐదు దశాబ్దాల పాటు పార్టీలోని వివిధ హోదాల్లో పని చేశారు. సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, కొత్తగూడెం శాసన సభ్యునిగా గతంలో పని చేశారు. ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కూనంనేని తిరిగి రెండవ సారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మొదటి నుండి ఆయన ప్రజలు, కార్మికులు, కర్షకులు, ప్రధానంగా సింగరేణి కార్మికుల పక్షాన పోరాడారు. అనేక ఉద్యమాల్లో పోలీసుల లాఠీ దెబ్బలు తిని, అరెస్టయ్యారు. అటువంటి ఉద్యమ నేత కూనంనేని, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి ఎన్నిక కావడం పట్ల పలువురు హర్ష వ్యక్తం చేస్తున్నారు.   

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే