బీఆర్ఎస్ కు ఓటేయడమంటే ... అభివృద్ధికి వేయడమే : ఎంపీ వద్ధిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు
బీఆర్ఎస్ కు ఓటేయడమంటే ... అభివృద్ధికి వేయడమేనని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు సూదన్ అన్నారు. గురువారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ముఖ్యంగా దళిత బంధు, రైతు బంధు, ఆరోగ్యశ్రీ, కల్యాణ లక్ష్మి, శాది ముబారక్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పులను హైలైట్ చేయాలని సూచించారు.
అదే విధంగా, యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ, వారిని పార్టీ కార్యకలాపాల్లో భాగస్వాములును చేయాలన్నారు. సోషల్ మీడియా వేదికలల్లో పార్టీ విజయాలను ప్రజలకు చెప్పాలని, పార్టీపై, కేసీఆర్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేస్తే, ఎన్నికల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఐక్యత, నిబద్ధత, క్రమ శిక్షణ విజయానికి మూల స్తంభాలుగా నిలవాలన్నా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెప్టెంబర్ 10,11 తేదీల్లో జరిగే రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కే .టి. రామారావు పర్యటనకు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వర రావు, బానోత్ హరిప్రియ నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మాజీ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ, భద్రాచలం నియోజక వర్గ నాయకులు రావుల పల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, వైరా నియోజకవర్గ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

.jpeg)

Comments
Post a Comment