సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీల తుది ఓటర్ జాబితా ... ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ
సెప్టెంబర్ 2న
వార్డుల వారిగా గ్రామ పంచాయతీల తుది ఓటర్ జాబితాను ప్రకటించనున్నట్లు ఖమ్మం జిల్లా
అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ చెప్పారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్
కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక సంస్థల
ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పి. శ్రీజ స్థానిక
సంస్థల ఎన్నికలకు వార్డుల వారిగా డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరోల్ గ్రామ పంచాయతీ, మండల పరిషత్
కార్యాలయాల్లో ఈ నెల 28 న ప్రదర్శించామన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై
కూడా కసరత్తు చేశామన్నారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 లోగా సంబంధిత
ఎంపిడివోకు తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 31న
పరిష్కరింస్తామని తెలిపారు.
రాజకీయ పార్టీలు సహకరించాలి ... ఈ నెల 30న మండల స్థాయి సమావేశాలు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ
పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ ఈ సందర్భంగా కోరారు. జిల్లాలో 571 గ్రామ పంచాయతీలకు గాను
5, 214 వార్డులు ఉన్నట్లు తెలిపారు.
8 లక్షల 2, 690 ఓటర్లకు 5, 214 పోలింగ్ కేంద్రాలను
ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 30 న మండల స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల
ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా
పంచాయతీ అధికారి ఆశాలత, జెడ్పీ డిప్యూటీ సిఇఓ నాగ పద్మజ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు
స్వర్ణ సుబ్బారావు, పసుమర్తి
శ్రీనివాస్, బహుజన
సమాజ్ పార్టీ ప్రతినిధి మిట్టపల్లి కిషోర్, బిజెపి ప్రతినిధులు జి.
విద్యాసాగర్ రావు, వై.
రాఘవ రావు, సిపిఐ(ఎం)
ప్రతినిధి బండి రావెలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధులు ఏ. గోపాల్ రావు, ఎస్. రాజయ్య, భారత రాష్ట్ర సమితి ప్రతినిధులు
బి. తిరుమల రావు, బెల్లం
వేణుగోపాల్, బంక
మల్లయ్య,
తెలుగుదేశం
పార్టీ ప్రతినిధులు కె. కరుణాకర్, ఎం. లహరి, సీపీఐ ప్రతినిధులు ఎం. శ్రీనివాసరావు, ఎస్. నరసింహ రావు, సిపిఐ(ఎంఎల్) ప్రతినిధి
ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
Comments
Post a Comment