మారణాయుధంతో భార్యపై భర్త దాడి

Crime

కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త మారణాయుధంతో భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన మధిర మండలంలోని మాటూరు గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగినట్లుగా తెలుస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిల్ల సూర్యనారాయణ ప్రైవేట్ లారీ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం విధులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సూర్యనారాయణ, భార్య సాయి నాగలక్ష్మి  ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సూర్యనారాయణ చేతికి దొరికిన మారణాయుదంతో ఆమెపై దాడికి దిగాడు. దీంతో నాగలక్ష్మి మెడపై బలమైన గాయమైంది. ఆమె కేకలు వేసుకుంటూ ఇంట్లో నుండి రోడ్డుపైకి వచ్చి కింద పడి పోవడంతో స్థానికులు108 అంబులెన్స్ లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మెడపై బలమైన గాయంతో తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఇప్పుడు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మధిర రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉండగా, ప్రస్తుతం నాగలక్ష్మి గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే