భారత్, చైనా సంబంధాల్లో సరి కొత్త అధ్యాయం ... 7 ఏళ్ళ తర్వాత చైనాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
భారత్, చైనా
సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ( Narendra Modi ) శనివారం షాంఘై సహకార
సంస్థ (SCO)
శిఖరాగ్ర
సమావేశంలో పాల్గొనేందుకు చైనాలోని టియాంజిన్ నగరానికి చేరుకున్నారు. గత ఏడేళ్ల
తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే తొలి సారి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న జరిగే ఈ వార్షిక
సదస్సులో పది దేశాల SCO (Shanghai Cooperation Organisation ) కూటమి నాయకులను ఆయన
కలవనున్నారు. ఇటీవల భారత్-( India) చైనా( Chaina ) సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆదివారం చైనా
అధ్యక్షుడు జిన్ పింగ్(Xi Jinping ) తో ప్రధాని మోడీ జరపనున్న ద్వైపాక్షిక చర్చలు ఆశక్తి
కరంగా మారాయి. ఈ భేటీపై ప్రపంచ దేశాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అలాగే, సెప్టెంబర్ 1న రష్యా అధ్యక్షుడు
వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin ) తో కూడా ప్రధాని మోడీ చర్చలు జరపనున్నారు. అమెరికాతో
భారత్ సంబంధాలు కొంత ఇబ్బంది కరంగా మారిన నేపధ్యంలో మోడీ చైనాలో పర్యటిస్తున్నారు.
రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న నెపంతో, ట్రంప్ ( Donald Trump ) ప్రభుత్వం భారతీయ
ఎగుమతులపై భారీ సుంకాలు విధించింది. దీంతో అమెరికాతో భారత్ సంబంధాలు కొంత ఇబ్బంది
కరంగా మారాయి. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు ముఖ్యమైనప్పటికీ, భారత్ చైనాతో కూడా
సంబంధాలను కొనసాగించాలనుకుంటోంది. నిన్న జపాన్ పర్యటనలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రస్తుత
ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని, రెండు ప్రధాన ఆర్థిక శక్తులైన భారత
దేశం,
చైనా
కలిసి పని చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని ఇవ్వాల్సిన అవసరం చాలా వుందన్నారు.
భారతదేశం, చైనా
మధ్య స్థిరమైన, స్నేహ
పూర్వక ద్వైపాక్షిక సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతి శ్రేయస్సుపై
కూడా సానుకూల ప్రభావం చూపుతాయని ఈ సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారు.
సవాళ్లు, అవకాశాలు
ప్రధాని మోడీ పర్యటనతో భారత్- చైనా సంబంధాలు సరి కొత్త అధ్యాయాన్ని లిఖించే
అవకాశముంది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు
దెబ్బతిన్నాయి. కానీ ఇటీవల జరిగిన దౌత్యపరమైన చర్చలు మళ్లీ ఇరు దేశాలు నమ్మకాన్ని
పెంచుకోవడానికి దోహద పడ్డాయి. రాజకీయ ఘర్షణలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం చైనా భారత దేశానికి
రెండవ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. భారతదేశ ఉత్పాదక రంగం ఇంకా
చైనా విడిభాగాలు, ముడి
పదార్థాలపై ఆధారపడుతోంది
.jpeg)
Comments
Post a Comment