వైరా రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతాం ... కలెక్టర్ అనుదీప్
వైరా రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని ఖమ్మం జిల్లా
కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సంబంధిత అధికార్లను
ఆదేశించారు. సందర్శకుల సౌకర్యార్ధం పర్యాటక ప్రాంతాల్లో మౌళిక వసతులు
కల్పించాలన్నారు. బుధవారం ఆయన వైరా నియోజక వర్గ కేంద్రంలోని రిజర్వాయర్
ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని గుట్టలను, బోటింగ్ ప్రాంతాన్ని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ
భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మత్స్య విత్తన క్షేత్రాన్ని కలెక్టర్
అనుదీప్ తనిఖీ చేశారు. విత్తన కేంద్రంలోని మౌళిక వసతులను పరిశీలించారు. కేంద్రంలో
పిచ్చి మొక్కలను, చెత్తను
తొలగించాలని, పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికార్లను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్
మాట్లాడుతూ రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప్రాంతాన్ని టూరిజం శాఖ
ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. బోటింగ్, కాటేజ్ గదులు, బిల్డింగ్
మరమ్మత్తులకు ప్రతిపాదనలు అందజేయాలని అధికార్లను ఆదేశించారు. మత్స్యకారులకు
జీవనోపాధి కల్పించడం కోసం చేప పిల్లలు సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు.ఈ పర్యటనలో కలెక్టర్
వెంట మత్స్య శాఖ ఎడీ శివప్రసాద్, జిల్లా టూరిజం శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, వైరా తహసిల్దార్
శ్రీనివాస రావు, మున్సిపల్
కమిషనర్ వేణుతదితరులు ఉన్నారు.
కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్
అనంతరం ఖమ్మం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కలిశారు. నియోజక వర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు సమబంధించిన ప్రతిపాదనలను అందజేశారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.



Comments
Post a Comment