మధిర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలి : అధికార్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

Mallu Bhatti Vikramarka

మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధిర పట్టణ సమగ్ర అభివృద్ధిపై సమీక్ష జరిపారు. నెలకు ఒక సారి మున్సిపల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC),  ప్రతి 15 రోజులకు సీఈ స్థాయి అధికారులు విధిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించాలన్నారు. వారం, 15 రోజులు,  నెల రోజుల వ్యవధిలో టార్గెట్లు నిర్దేశించుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను మధిర పట్టణ ప్రజలకు తెలియ జేయాలని, ప్రజలకు అవగాహన కల్పించడంలో స్థానిక వార్డు కౌన్సిలర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మమైన ఈ ప్రాజెక్టు పనులపై తాను తరచూ సమీక్ష చేస్తానని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు అందుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా జాలి మూడి నుంచి మధిర పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ వైకుంఠ దామం తరహాలో మధిర వైకుంఠధామం నిర్మాణం చేయాలని ఆదేశించారు. నెల రోజుల్లో అంబేద్కర్ స్టేడియం పనులు పూర్తి చేయాలన్నారు. మధిర పట్టణంలో చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్ కు తరలించాలని, రహదారుల వెంట చెత్త కనిపించడానికి వీల్లేదని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పర్యాటక, మున్సిపల్, రోడ్లు భవనాల శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ట్యాంక్ బండ్, ఇతర నగర సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ. టీకే  శ్రీదేవి, పబ్లిక్ హెల్త్ ఈఎవ్సీ భాస్కర్ రెడ్డి, మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Mallu Bhatti Vikramarka

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే