ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శుభారంభం
వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమి పూజ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా పవిత్ర క్రతువు ఖమ్మం: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఖమ్మంలో కొలువుదీరేందుకు తొలి అడుగు పడింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో శ్రీవారి దివ్యాలయ నిర్మాణానికి టీటీడీ సోమవారం శ్రీకారం చుట్టింది. వేద మంత్రోచ్చారణలు , మంగళవాయిద్యాల నడుమ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు , తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వేద మంత్రాల సాక్షిగా ఆధ్యాత్మిక శుభారంభం ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా ముందుగా హోమాలు , ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు భూమి పూజ ప్రదేశాన్ని సంప్రోక్షణ చేసిన అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ జరిగింది. ఈ పవిత్ర ఘట్టం అనంతరం శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామివారితో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయ నిర్మాణ శ...