పెసర రైతులను ఆదుకోండి ... మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి డిమాండ్
ఖమ్మం జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నష్ట పోయిన పెసర రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి ( Banoth Chandravathi ) డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన వర్షాలకు పెసర రైతులు బాగా నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. ఆదివారం ఆమె వైరా నియోజక వర్గంలోని కొణిజర్ల మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాణోత్ చంద్రవతి మాట్లాడుతూ అనేక చోట్ల వర్షాలకు పెసర (Green Gram ) పంట కుళ్ళి, బూజు పట్టి పోయిందన్నారు. ఇది చూసిన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని, వారిని ఆదుకొనేందుకు తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, రైతులకు పంటల భీమాను కూడా అమలు చేయాలన్నారు. పంటల బీమాను అమలు చేస్తే, పంటలు నష్ట పోయిన రైతులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా చంద్రావతి పేర్కొన్నారు. ఈ పర్యటనలో పలువురు రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

.jpeg)

Comments
Post a Comment