నీలి రంగు కోడి గుడ్డును ఎప్పుడైనా చూశారా ? ... మరి ... ఆ గుడ్డు ఎక్కడుందో తెలుసుకోండి ... !

నీలి రంగు కోడి గుడ్డు

కర్ణాటకలోని ఓ కోడి నీలి రంగు గుడ్డు పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. సాధారణంగా గుడ్లు తెలుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటాయి. కానీ, దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా నెల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు పెంచుతున్న కోడి ఇలా వింతగా నీలి రంగు గుడ్డు పెట్టింది. రెండేళ్ల క్రితం సయ్యద్ నూర్ ఒక కోడిని రూ. 20 పెట్టి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అది తెల్ల గుడ్లు పెట్టేది. అయితే, ఇటీవల అనూహ్యంగా నీలి రంగు గుడ్డును పెట్టింది. ఈ విషయం తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆ గుడ్డును చూడటానికి వస్తున్నారు.

నీలి రంగు కోడి గుడ్డు

నిపుణులు ఏమంటున్నారు ?

పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ అశోక్ దీనిపై స్పందిస్తూ, "కోడి క్లోమంలోని 'బైలివర్డిన్' అనే వర్ణ ద్రవ్యం వల్ల అరుదుగా ఇలా జరుగుతుంది" అని తెలిపారు. మరో పశు వైద్య అధికారి డాక్టర్ రఘు నాయక్ మాట్లాడుతూ, "గుడ్డు పై పొర నీలం రంగులోకి మారడానికి ఈ వర్ణ ద్రవ్యమే ప్రధాన కారణం. కొన్ని సార్లు జన్యుపరమైన సమస్యలు లేదా కోడి తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంది" అని వివరించారు.

అసలు నీలి గుడ్లు ఎందుకు వస్తాయి ?

సాధారణంగా ఆకు పచ్చ, నీలి రంగు గుడ్లు పెట్టే జాతులు ఉన్నాయి. ఈ జాతుల్లో 'ఓసైన్' అనే జన్యువు గుడ్లకు నీలి రంగును ఇస్తుంది. అయితే, సయ్యద్ నూర్ పెంచుతున్న కోడి సాధారణ కోడి జాతికి చెందినది కాబట్టి, ఇలా రంగు మారడానికి జన్యుపరమైన సమస్యలు లేదా ఆహారంలో మార్పులు కారణం కావచ్చు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే