ఈ పని చేయండి ... ప్రధాని మోడీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ విజ్ఞప్తి
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandra Bose )అస్థికలను భారతదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ (Anita Bose Pfaff ) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నందున, ఈ అభ్యర్థన ప్రాధాన్యత సంతరించుకుంది. తన వయసు మీద పడుతున్నందున, ఈ సమస్యకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని ఆమె కోరారు. ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్న 82 ఏళ్ల అనితా బోస్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తే, తన తండ్రి అస్థికలను స్వదేశానికి తీసుకు రావాలని కచ్చితంగా కోరతానన్నారు. "గతంలో పీవీ నరసింహా రావు ప్రభుత్వం నా తండ్రి అస్థికలను తీసుకురావడానికి ప్రయత్నించింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలి. నా వయసును దృష్టిలో ఉంచుకుని ఈ పని చేయాలని ఆమె కోరారు.
.jpeg)
Comments
Post a Comment