అంతర్జాతీయ సంబంధాల్లో కీలక పాత్ర పోషించ బోతున్న భారత్ ... ఉక్రెయిన్లో శాంతి కోసం మోడీకి జెలెన్‌స్కీ ఫోన్

Narendra Modi

ఉక్రెయిన్‌ ( Ukraine ) అధ్యక్షుడు జెలెన్‌స్కీ( Volodymyr Zelensky), భారత ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi ) ల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ( Phone Conversation ) ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్లో శాంతిని పునరుద్ధరించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించాలని జెలెన్‌స్కీ కోరారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదని, ప్రపంచ శాంతికి సంబంధించిందని ఆయన మోడీతో అన్నారు.

Zelensky

కాల్పుల విరమణే శాంతికి తొలి అడుగు : జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌లో యుద్ధం ( War ) తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ నెల రోజుల వ్యవధిలో రెండో సారి మోడీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. తక్షణమే కాల్పుల విరమణ కోసం రష్యాపై తేవాలని, షాంఘై సహకార సంస్థ ( Shanghai Cooperation Organization ) సదస్సులో ఈ విషయాన్ని ప్రస్తావించి రష్యాను ఒప్పించాలని కోరారు. ఉక్రెయిన్‌ నగరాలపై నిరంతర దాడులు జరుగుతున్నందున శాంతి చర్చలు సాధ్యం కావని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. యుద్ధం ఆగి పోవాలంటే కాల్పుల విరమణే మొదటి అడుగని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన మేరకు, ఈ సంభాషణలో జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇతర యూరోపియన్‌ నాయకులతో జరిగిన చర్చల వివరాలను కూడా మోదీకి వివరించారు.

శాంతి యుత పరిష్కారానికి ప్రయత్నిస్తాం : మోడీ

జెలెన్‌స్కీ విజ్ఞప్తికి స్పందిస్తూ, ఈ సంక్షోభానికి శాంతి యుత పరిష్కారమే సరైన మార్గమని భారత్ స్థిరంగా విశ్వసిస్తోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. శాంతిని నెలకొల్పేందుకు భారత్‌ అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి కూడా చర్చించారు.

పుతిన్ తో మోడీ భేటీకి ముందు జెలెన్‌స్కీ ఫోన్

ప్రస్తుతం ప్రధాని మోదీ చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న SCO సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సులో ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సరిగ్గా ఈ భేటీకి ముందు జెలెన్‌స్కీ మోదీకి ఫోన్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో భారత్, రష్యా-ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చలకు మధ్య వర్తిత్వం వహించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌ రష్యా ( Russia ) కు ముఖ్యమైన మిత్ర దేశంగా ఉన్నప్పటికీ, ప్రపంచ శాంతి కోసం ఉక్రెయిన్‌ వైపు కూడా నిలబడి సమతుల్యత పాటించగలదని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది.ఈ మొత్తం వ్యవహారం భారత్‌ అంతర్జాతీయ సంబంధాల్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది. యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపన కోసం భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే