Posts

Showing posts from July, 2025

అసదుద్ధీన్, అక్భరుద్ధీన్, షబ్బీర్ అలీ బీసీలు ఎలా అవుతారు ? ... బీజేపీ నేత ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్

Image
తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల వల్ల నిజమైన బీసీలు నష్ట పోతారని భారతీయజనతా పార్టీ రాష్ట్ర నాయకులు , ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇప్పటికే10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారని , మళ్ళీ 42 శాతం రిజర్వేషన్లలో ముస్లింలను కూడా కలిపితే , బీసీలకు న్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ధి జరుగుతుందాని , అసదుద్దీన్ , అక్భరుద్ధీన్ , షబ్బీర్ అలీలు బీసీలు ఎలా అవుతారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వాళ్ళ పేర్లు కూడా బీసీల జాబితాలో వున్నాయని , బీసీ వర్గాల వాస్తవ గణాంకాలను తక్కువ చేసి , ఇతర వర్గాలను బీసీ జాబితాలో చేర్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఆయన తన పర్యటలో భాగంగా ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ బీసీల రిజర్వేషన్ల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. బీసీల హక్కులను తాకట్టు పెట్టి , రాజకీయ లబ్ధి కోసం ప్రయోగాలు చేస్తుందని దువ్వ బట్టారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకల జనుల సర్వేలో బీసీల జనాభా దాదాపు 55   శాతంగా ఉన్నట్టు నివేదికలు వచ్చాయని ...

మోదీ పాలన దేశానికి ప్రమాదకరం ... తమ్మినేని వీరభద్రం

Image
మోదీ పాలన దేశానికి ప్రమాదకరమని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేనివీరభద్రం అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్లో జరిగిన పార్టీ ఖమ్మం డివిజన్ వర్క్ షాప్లో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఒక మతతత్వ పార్టీయని , మోదీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో ఆర్థిక రంగంలో సంస్కరణలను వేగవంతం చేశార విమర్శించారు. ముఖ్యంగా రైల్వే , రక్షణ , విద్య , వైద్య , బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారని అన్నారు. కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను ప్రభుత్వం కాలరాసిందన్నారని ద్వజ మెత్తారు. బీజేపీ మతతత్వాన్ని కార్పొరేట్ శక్తులు కూడా సమర్థిస్తున్నాయని , ఇది అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలపై బీజేపీ దాడి చేస్తుందని , కొన్ని రాష్ట్రాల్లో పౌరసత్వం నిరూపించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని , దేశాన్ని విచ్చిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుందని , అధికారంలోకి వస్తే మనవాద సిద్ధాంతాలు అమలు చేస్తారన్నారు. వారి సిద్ధాంతం ప్రకారం , దేశంలో ఇతర మతాలను రెండవ తరగతి పౌరులుగా గుర్తిస్తున్నారని చెప్పారు. ఈ ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాలపై ఐక్...

ఖమ్మం కార్పోరేషన్ విలీన గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ... మంత్రి తుమ్మల

Image
ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని ,   విలీన గ్రాల్లో మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్ , సహకార , చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ , ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి శనివారం ఆయన ఖమ్మం నగరంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు. 3 వ డివిజన్లో రూ. 50 లక్షలతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు , రూ. 50 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు , ఈనాడు బైపాస్ రోడ్డు నుంచి బల్లెపల్లి వరకు కోటి 80 లక్షల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు , బల్లేపల్లి ఎస్సీ కాలనీలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు , డ్రైన్ల నిర్మాణ పనులకు తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ విలీన గ్రామాల్లో అంతర్గత ససీసీ రోడ్ల నిర్మాణం , డ్రైయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి ఇప్పటి వరకు 200 కోట్లరూపాయల విలువ గల పనులు మంజూరు చేశామన్నారు. మరో రూ. 150 కోట్లు మేరకు ప్రతిపాదనలు పంపామని , ఆగస...

సుప్రీం కోర్టు కీలక తీర్పు ... ఇక ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్ అప్పుడే

Image
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో నియోజక వర్గాల పునర్విభజన కోరుతూ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టి వేసింది. జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి , కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో దాఖలు చేసిన తన పిటిషన్లో , ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజక వర్గాల పెంపుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జమ్మూ కశ్మీర్‌లో పునర్విభజన జరిగినప్పుడు , ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని , ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు , వ్యాఖ్యలు సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించిన అనంతరం , రాజ్యాంగంలోని అధికరణ 170 (3) ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26 కి పరిమితి ఉందని స్పష్టం చేసింది. 2026 తర్వాత జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతే డీలిమిటేషన్ (నియోజక వర్గాల పునర్విభజన) నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి వ్యాజ్యాలను అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా నియోజక వర్గ...

మున్నేరులో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

Image
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని చిన్న మండవ వద్ద మున్నేరు లో చిక్కుకున్న ఐదుగురు గ్రామస్తులను ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. గురువారం ఉదయం వరద ఉధృతి లేక పోవడంతో చిన్న మండవ గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య , మొండితోక పుల్లయ్య , గుండ్ల వెంకటేశ్వర్లు , దరెల్లి శ్రీను , కుక్కల గోపి గేదెలు మేపడానికి లంకలోకి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వరద ఉధృతి పెరగడంతో భయంతో రాలేక లంకలోనే వున్నారు. సమాచారం అందుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన కలెక్టర్ అనుదీప్ , అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపారు. 25 మంది సభ్యుల ఎన్డిఆర్ఎఫ్ బృందం , మున్నేరులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. సహాయక చర్యల్లో వైరా ఏసీపీ రహమాన్ , చింతకాని మండల తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఈ సందర్భంగా కలె...

చిన్న మండవ వద్ద మున్నేరులో చిక్కుకున్న ఐదుగురు ... రక్షించాలని మంత్రి తుమ్మల ఆదేశం

Image
ఖమ్మం జిల్లాలోని చిన్నమండవ ( చింతకాని మండలం ) వద్ద మున్నేరు లో గురువారం ఐదుగురు చిక్కుకున్నారు. వీరు గేదలను మేపడానికి వెళ్ళి చిక్కుకున్నట్లు చెలుస్తోంది. వారిని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులకు ఆదేశించారు. ఎన్ డి ఆ ర్ఎఫ్ బృందాలను పంపిం , అందర్నీ క్షేమంగా బయటకు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ , పోలీసులకు సూచించారు. అయితే , మున్నేరులో చిక్కుకున్న వారి వివరాలు తెలియాల్సి వుంది. అంతకు ముందు , తుమ్మల ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుండే జిల్లా కలెక్టర్ అనుదీప్ తో పాటు ఉన్నతాధికారులతో తుమ్మల మాట్లాడారు. ఖమ్మం జిల్లాతో పాటు మున్నేరు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తుమ్మల ఆదేశించారు. గత ఏడాది వరదల వల్ల వందల మంది నిరాశ్రయులయ్యారని , మళ్లీ అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని , సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే , తప్పకుండా పునర...

ఖమ్మంలో కొలువు దీరనున్న కలియుగ దైవం ... తుమ్మల చొరవతో ఆలయ నిర్మాణానికి టీటీడీ నిర్ణయం

Image
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఖమ్మంలో  కొలువుదీర బోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మానానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆలయంతో పాటు పెద్ద కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించేందుకు ఈ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవతో టీటీడీ అధికార ప్రతినిధి బృంధం ఇందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా గురువారం ఖమ్మం వచ్చిన టీ.టీ.డీ ఎస్.ఈ జగదీశ్వర్ రెడ్డి , ఇ .ఇ సురేందర్ నాథ రెడ్డి , ఢీ.ఇ.ఇ నాగభూషణం , ఎలక్ట్రికల్ ఈ.ఈ రవి శంకర్ రెడ్డి , ఏ ఈ జగన్మోహన్ రావులతో కూడిన అధికార బృంధం అల్లీపురం , రఘునాధ పాలెం ప్రాంతాల్లో ఆలయ నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అధికార బృంధం మంత్రి తుమ్మలను కలిసి ఆలయం , కళ్యాణ మండపాలకు సంబంధించిన నమూనాలను చూపించారు. నిర్మాణానికి సంబంధించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. తుమ్మల నాగేశ్వర రావు , టీ.టీ.డీ చైర్మన్ బీ.అర్.నాయుడుకు చేసిన ఆలయ నిర్మాణం ప్రతిపాదనలకు  స్పందించిన టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రాణాలు హరిస్తున్న గడ్డి మందును నిషేధించాలి : ఎంపీ రఘురాం రెడ్డి

Image
తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన ‘ పారాక్వాట్ ’ గడ్డి మందును నిషేధించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. క్షణికావేశంలో తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని , కేంద్ర ప్రభుత్వం దీనిని వెంటనే నిషేధించాలని అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా బుధవారం 377 నిబంధన కింద ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైద్య చికిత్సలో విరుగుడు లేక తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోతున్న రైతులు , వ్యవసాయ కూలీలు , యువకుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందన్నారు. 60 కి పైగా దేశాల్లో నిషేధం పారాక్వాట్ పై 60 కి పైగా దేశాలు నిషేధం విధించాయని తెలిపారు. దీని వినియోగంతో పర్యావరణానికి కూడా ముప్పు పొంచి ఉందన్నారు. గోధుమలు , పప్పు ధాన్యాలు వంటి ప్రధాన పంటల్లో ఈ గడ్డి మందు అవశేషాలను గుర్తించారని , ప్రజల ఆరోగ్యానికి కూడా ఇది ప్రమాదకరమన్నారు. పారాక్వాట్ కు ప్రత్యామ్నాయ మందును అందుబాటులోకి తెచ్చి , క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు , ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కోరారు. గడ్డి మందు ని...

ఉచిత బస్సు ప్రయాణంతో సగటున మహిళకు నెలకు రూ. 3,000 ఆదా: మంత్రి తుమ్మల

Image
మహిళల చిరు నవ్వులే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదమని రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్ , చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల , సగటు మహిళకు నెలకు 3 వేల రూపాయాలు ఆదా అవుతున్నాయని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా బుధవారం ఖమ్మం నగరంలోని క్రొత్త బస్ స్టాండ్లో సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం క్రింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామన్నారు. చిన్న ఉద్యోగాలు , వ్యాపారాలు చేసే మహిళలకు ఉపయోగకరంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉందని , 20 నెలల కాలంలో ప్రభుత్వం ఈ పథకంపై 6 , 700 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిందని తెలిపింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు ఆర్...

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుపై ఉత్కంఠ... స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలయ్యేనా ?

Image
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలకు సంబంధించిన అంశం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కార్యరూపం దాల్చక పోవడంతో , సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాలుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రెండు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. మొదటిది , ఇటీవల 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అయితే , ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇంకా ఆమోదం తెలప లేదు. ఆయన దాన్ని  న్యాయ సలహా నిమిత్తం కేంద్ర హోంశాఖకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించగా , తాజాగా ఆయన దాన్నికేంద్ర హోంశాఖకు పంపించారు. దీంతో బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.  మరో వైపు , ఆర్డినెన్స్‌కు ముందే తెలంగాణ ప్రభుత్వం ఇదే 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించి , కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపింది. ఈ బిల్లుకు కూడా ఇప్పటి వరకు ఆ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు ? ... చంద్రబాబు నాయుడు ఉప రాష్ట్రపతి, లోకేశ్ ముఖ్యమంత్రి ?

Image
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టబోతున్నారని , ఆ తర్వాత ఆయన కుమారుడు , మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా అనంతరం , ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి స్థానానికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ( NDA) కూటమి చంద్రబాబు నాయుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ భారతదేశం నుండి ఒక బలమైన నాయకుడిని ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా , బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దక్షిణాదిలో మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చంద్రబాబునే ఎందుకు ఎంపిక చేస్తారు ? చంద్రబాబు నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే , ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం , పరిపాలనా దక్షత దేశస్థాయిలో ఉపయోగపడతాయని ఎన్డీఏ భావించే అవకాశం వుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి , ముఖ్యంగా నారా ...

మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు ... భారత వైమానిక దళ చరిత్రలో ముగుస్తున్న ఒక శకం

Image
భారత వైమానిక దళానికి ఆరు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా సేవలందించిన ఐకానిక్ మిగ్-21 యుద్ధ విమానాలు సెప్టెంబర్ 19న అధికారికంగా రిటైర్ కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా చండీగఢ్ ఎయిర్‌ బేస్‌లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ' ప్యాంథర్స్ ' అని పిలువబడే IAF యొక్క 23వ స్క్వాడ్రన్‌కు చెందిన మిగ్-21 విమానాలు శాశ్వతంగా రద్దవుతాయి. 1963లో భారత వైమానిక దళంలోకి ప్రవేశించిన మిగ్-21 , భారతదేశపు మొదటి సూపర్ సోనిక్ యుద్ధ విమానంగా చరిత్రలో నిలిచింది.1965 , 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధాలు , 1999లో కార్గిల్ యుద్ధం , 2019లో  బాలాకోట్ వైమానిక దాడులతో సహా దాదాపు అన్ని ప్రధాన సైనిక కార్యకలాపాల్లో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. భారత వైమానిక దళానికి చాలా కాలం పాటు వెన్నెముకగా నిలిచిన మిగ్-21 , ఎంతో మంది భారతీయ ఫైటర్ పైలట్ల కెరీర్‌ను ప్రభావితం చేసింది. తరచూ ప్రమాదాలకు గురైన మిగ్ 21 అయితే , ఇటీవల కాలంలో ఈ విమానం తరచుగా ప్రమాదాలకు గురై , ' ఎగిరే శవపేటిక ' అనే పేరును సంపాదించుకుంది. పాత బడిన సాంకేతికత , నిర్వహణ సవాళ్లు , విడిభాగాల లభ్యతలో సమస్యలు ఈ ప్రమా...

ఉప రాష్ట్రపతి ధన్‌ఖర్ రాజీనామాపై రాజకీయ దుమారం

Image
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అనారోగ్య కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన రాజీనామా లేఖలో ధన్‌ఖర్ పేర్కొన్నప్పటికీ , ప్రతి పక్షాలు మాత్రం మరో వాదనను తెరపైకి తెస్తున్నాయి. తన అధికార నివాసంలో భారీగా డబ్బు దొరికిన నేపధ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని నిన్నటి పార్లమెంట్ సమావేశంలో ప్రతి పక్ష ఎంపీలు నోటీసు ఇచ్చారు. రాజ్యసభ ఛైర్మన్ గా వున్న ధన్ ఖర్ , ఈ నోటీసును ఆమోదించి , అవసరమైన చర్యలు తీసుకోవాలని సభ సెక్రటరీ జనరల్ ను ఆదేశించారు. ఈ నిర్ణయం కేంద్రానికి నచ్చలేదని అంటున్నారు. ఇది జరిగిన తర్వాత , నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన కీలక బిజినెస్ అడ్వైజరీ కమిటీ ( బీఏసీ ) సమావేశానికి కీలక మంత్రులు , సభాపక్ష నేత జేపీ నడ్డా , పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాలేదు.   బీఏసీ సమావేశానికి వారు హాజరు కాక పోవడంతో ధన్‌ఖర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని , ఇది ఉప రాష్ట్రపతి రాజీనామాకు దారి తీసిందని ప్రతి పక్షాలు అంటున్నాయి. అయితే , ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. సభాపక్ష నేత జేపీ నడ్డా దీనిపై స్పందిస్తూ ...

అమ్ముకున్న దళిత బంధు యూనిట్ల వెరిఫికేషన్ ... తిరిగి లబ్ధిదారులకు అప్పగింత : డిప్యూటీ సీఎం భట్టి

Image
దళిత బంధు మొదటి విడత డబ్బులతో ఏర్పాటు చేసిన యూనిట్లను , లబ్ధిదారులు ఇతరులకు అమ్ముకొంటే వాటిని తిరిగి లబ్దిదారులకు అప్పగిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమావారం ఆయన చింతకాని మండల కేంద్రంలో 214 మంది దళిత బంధు లబ్దిదారులకు రెండవ విడత నిధులకు సంబంధిచిన చెక్కులను అందజేశారు. అలాగే బోనకల్లు మండల కేంద్రంలో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో భట్టి మాట్లాడుతూ దళిత బంధు లబ్దిదారుల నుండి ఎవరైనాతెలిసీ , తెలియక కొనుగోలు చేసినా , వాటిని తిరిగి లబ్దిదారులకు అప్పగించడంలో సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఎన్ని యూనిట్లు ప్రక్క దారి పట్టాయన్న దానిపై వెరిఫికేషన్ జరుగుతోందని , పూర్తి కాగానే వాటిని అసలు లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు. అంతే కాకుండా , తిరిగి అప్పగించిన లబ్ధిదారులకు రెండో విడత నిధులను కూడా మంజూరు చేస్తామని చెప్పారు. 93 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం దేశంలోనే రికార్డు రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా , సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తున్నామని భట్టి ఈ సందర్భంగా చెప్ప...

సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా దండి ... సహాయ కార్యదర్శిగా జమ్ముల

Image
సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా దండి సురేష్ , సహాయ కార్యదర్శిగా జమ్ముల జితేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు రోజుల పాటు మధిరలో జరిగిన జిల్లా 23 వ మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. మహాసభలో 91 మందితో  కౌన్సిల్ను 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో సాంప్రదాయ కమ్యూనిస్టు కుటుంభంలో జన్మించారు. విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో పని చేసిన సురేష్ , ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా కూడా పని చేశారు. ప్రస్తుతం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పని చేస్తున్న ఆయన ఈ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు.  సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి చింతకాని మండలంలోని నాగిలిగొండ గ్రామంలో జన్మించారు. విద్యార్థి యువజన ఉద్యమాలలో పని చేసిన ఆయన , తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంలో సుదీర్ఘ కాలం జిల్లా , రాష్ట్ర బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు . పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు , నాయకులు భాగం హేమంతరావు , మహమ్మద్ మౌలానా నూతన నాయ...

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

Image
అటవీ భూముల ఆక్రమణ , అధికార్లు , సిబ్బందిపై దాడులు , వాటిపై తప్పుడు వార్తలను సహించేది లేదని , చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ఈ నెల 16న అటవీ అధికారులు , సిబ్బందిపై దాడి జరిగితే , కొన్ని పత్రికల్లో గిరిజనులపై అటవీ అధికారులు దాడి చేసినట్లు ప్రచురించడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఇటువంటి నకిలీ వార్తలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దాడికి గురైన అధికారి డి. చక్రవర్తి గిరిజన కమ్యూనిటీకి చెందిన వారని వెల్లడించారు. ఘటనలో మహిళలు కొద్ది మంది మాత్రమే వున్నారని , గిరిజనేతరులే ఎక్కువ మంది వున్నారని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా దాడికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. ఆ రోజు అటవీ ఆక్రమణల నిరోధానికి తాళ్లగూడెం మహిళా ఫారెస్ట్ సెక్షన్ అధికారి డి. శిల్ప , బీఆర్. పురం ఫారెస్ట్ సెక్షన్ అధికారి డి. చక్రవర్తి చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లగా ఆక్రమణ దారులు కారం పొడి కళ్ళలో చల్లుతూ , రాళ్లు రువ్వుతూ , తిడుతూ అధికారులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనలో అటవీ అధికారులు , సిబ్బందిపై దాడి చేసిన16 ...

ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేరుతోనే ... వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Image
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేరునే అమలు చేస్తున్నామని చెప్పారు. శనివారం  వైరా మార్కెట్ యార్డులో నిర్వహించిన నియోజక వర్గ ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు , కొత్త రేషన్ కార్డులు , 200 యూనిట్ల ఉచిత కరంట్ , వడ్డీ లేని రుణాలు , రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం , రైతు రుణమాఫీ , రైతు భీమా , రైతు భరోసా , రాజీవ్ ఆరోగ్య శ్రీ తో 10 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వందల కోట్లతో వైరా నియోజక వర్గ అభివృద్ధి వైరా నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో సిమెంట్ రోడ్డులు నిర్మించామని , రాజీవ్ కెనాల్ ద్వారా సాగు నీరు అందిస్తున్నామన్నారు. రూ. 125 కోట్లతో   యంగ్ ఇండియా స్కూళ్ళు , వంద పడకల ఆసుపత్రి లాంటి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇం...

విప్లవ కారులు మృతదేహాలకు బీజేపీ భయపడుతోంది : కూనంనేని

Image
విప్లవకారుల మృత దేహాలకు బీజేపీ నేతలు భయపడుతున్నారని , హతమార్చిన తర్వాత మృత దేహాలను కుటుంబీకులకు ఇచ్చేందుకు జంకుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి , కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివ రావు అన్నారు. మరణించిన తర్వాత కూడా విప్లకారులు ప్రజలను చైతన్యవంతులను చేస్తారనే భయంతో బీజేపీ నేతలు జంకుతున్నారని , విప్లకారులను లేకుండా చేయడం ఎవరితరం కాదన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా 23వ -మహాసభలు శనివారం మధిర నియోజకవర్గ కేంద్రంలోని పోటు ప్రసాద్ నగర్ (రెడ్డి గార్డెన్స్) లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభలకు ముందు పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఎగుర వేశారు. మృత వీరుల స్మారక స్థూపాన్ని రాష్ట్ర కంట్రోల్ కమీషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ బీజేపీ నేతలు మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రశ్నించే వారిని లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులను తుదముట్టిస్తామని అమితా షా లాంటి వారు ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. ప్రజల పక్షాన పనిచేసే కమ్యూనిస్టులను లేకుండా చేయడం ఎవరి తరం కాదని , కమ్యూనిస్టు సిద్ధాంతం -విశ్వ...

లోకేశ్ పై కేటీఆర్ పొగడ్తలు ... తెలంగాణలో బీఆర్ఎస్ కొత్త వ్యూహానికి సంకేతమా ?

Image
తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ వ్యతిరేకిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేసే బీఆర్ఎస్ పార్టీ , ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ , చంద్రబాబు తనయుడు , ఏపీ మంత్రి నారా లోకేష్‌ను పొగడటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. కేటీఆర్ వ్యాఖ్యలు ... వ్యూహాత్మక మార్పుకు సంకేతమా  ? నారా లోకేష్‌తో రహస్యంగా భేటీ అయ్యారన్న రేవంత్ రెడ్డి ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ , " కలవ లేదు కానీ... నేను లోకేష్‌ను కలిస్తే తప్పేంటి ?" అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు పట్ల బీఆర్ఎస్ ఇప్పటి వరకు అనుసరించిన వైఖరికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని "చంద్రబాబు శిష్యుడు"గా అభివర్ణిస్తూ , తెలంగాణలో రాజకీయ లబ్ది పొందాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ , ఇప్పుడు లోకేష్‌ను పొగడటం , ఆయనతో భేటీని సమర్థించుకోవడం బీఆర్ఎస్ రాజకీయ వ్యూహంలో మార్పును సూచిస్తోంది. దూరం... సాన్నిహిత్యంగా మా...

ఇంట్లో బాగు చేసుకోలేని సన్నాసులు ... ! కేటీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల ఫైర్

Image
మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ఖమ్మం పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్రంగా ఖంఢించారు. ప్రజలు , విలేకర్లు సహితం అసహ్యించుకొనేలా నోటికొచ్చినట్లు మాట్లాడారని మండి పడ్డారు. ఒక్కళ్ళిద్ధరి అక్కసుకో , అసూయకో ఈ ప్రజాస్వామ్యం బలై పోవాలా ? వాళ్ళు వాడే భాషకు మన మందరం తెలుగు ప్రజలుగా తల దించుకోవాలా ? అన్నది తనకు అర్ధం కావట్లేదన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఖమ్మం అర్భన్ పార్కులో మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో సరి చేసుకోలేని సన్నాసులు , రాష్ట్రాన్నీ , దేశాన్నీ ఏదో చేస్తామంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన వాళ్ళు , పదే పదే అవే మాటలు మాట్లాడుతున్నారంటే ... ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదని అర్ధమవుతుందన్నారు. ఇక ముందు కూడా బుద్ధి రాదన్నారు. గోదావరి , బనక చర్ల , కూలిన కాళేశ్వరంపైన బొంకిందే బొంకుతున్నారని విమర్శించారు. ఒక ప్రక్క పెద్దాయని ఏదిపడితే అది మాట్లాడొద్దని చెబుతున్నా వినకుండా బయట ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. దయ చేసి ఇకనైనా సరే , అసహ్యకరమైన , నీచమైన , దుర్మార్...