ఉచిత బస్సు ప్రయాణంతో సగటున మహిళకు నెలకు రూ. 3,000 ఆదా: మంత్రి తుమ్మల

Thummala Nageswara Rao

మహిళల చిరు నవ్వులే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల, సగటు మహిళకు నెలకు 3 వేల రూపాయాలు ఆదా అవుతున్నాయని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా బుధవారం ఖమ్మం నగరంలోని క్రొత్త బస్ స్టాండ్లో సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం క్రింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామన్నారు. చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళలకు ఉపయోగకరంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉందని, 20 నెలల కాలంలో ప్రభుత్వం ఈ పథకంపై 6,700 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిందని తెలిపింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు ఆర్టీసీ సంస్థ నిలబడేందుకు ఈ పథకం ఉపయోగ పడిందన్నారు. మన రాష్ట్రంలో అమలు జరిగిన తీరును పరిశీలించి, ప్రక్క రాష్ట్రాలలో ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ప్రారంభమవుతుందని, మన తెలంగాణ దేశానికే ఆదర్శవంతంగా నిలిచిందని పేర్కొన్నారు. సజ్జనార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ సమర్ధవంతంగా పని చేస్తుందని అన్నారు.

Thummala Nageswara Rao

మహిళల చిరు నవ్వులే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం

మహిళల చిరు నవ్వులే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదమన్నారు. 500  రూపాయల గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలు కూడా మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళల ఆశీర్వాదం ఉంటే అన్ని పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తామని అన్నారు. ఖమ్మం నగరంలో అవసరమైన సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, హైదరాబాద్ కు దీటుగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఖమ్మం ఖిల్లా రోప్ వే నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టామని, సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా గడిపే విధంగా ఖిల్లా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో లకారం చెరువు అభివృద్ధి చేస్తే చాలా మంది అడ్డు పడ్డారని, నేడు అక్కడ సాయంత్రం చాలా కుటుంబాలు ఆహ్లాదంగా గడుపుతున్నాయని, అదే విధంగా ఖమ్మం ఖిల్లా, వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఖమ్మం నగరంలో మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు, స్వామి నారాయణ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం గతంలో మూలగూడెం గ్రామస్థులకు ఇచ్చిన వాగ్దానం మేరకు మంత్రి తుమ్మల ఖమ్మం బస్ స్టాండ్ నుండి మూలగూడెం వరకు క్రొత్తగా బస్ సర్వీస్ ను ప్రారంభించి అదే బస్లో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, అర్బన్ తహసిల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. 

Thummala Nageswara Rao

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు