మోదీ పాలన దేశానికి ప్రమాదకరం ... తమ్మినేని వీరభద్రం

Thammineni Veera Bhadram

మోదీ పాలన దేశానికి ప్రమాదకరమని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేనివీరభద్రం అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్లో జరిగిన పార్టీ ఖమ్మం డివిజన్ వర్క్ షాప్లో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఒక మతతత్వ పార్టీయని, మోదీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో ఆర్థిక రంగంలో సంస్కరణలను వేగవంతం చేశార విమర్శించారు. ముఖ్యంగా రైల్వే, రక్షణ, విద్య, వైద్య, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారని అన్నారు. కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను ప్రభుత్వం కాలరాసిందన్నారని ద్వజ మెత్తారు. బీజేపీ మతతత్వాన్ని కార్పొరేట్ శక్తులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలపై బీజేపీ దాడి చేస్తుందని, కొన్ని రాష్ట్రాల్లో పౌరసత్వం నిరూపించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, దేశాన్ని విచ్చిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుందని, అధికారంలోకి వస్తే మనవాద సిద్ధాంతాలు అమలు చేస్తారన్నారు. వారి సిద్ధాంతం ప్రకారం, దేశంలో ఇతర మతాలను రెండవ తరగతి పౌరులుగా గుర్తిస్తున్నారని చెప్పారు. ఈ ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్మించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్త కులగణనను వ్యతిరేకిస్తుందని, కానీ కులగణనకు, రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్రంలో బిజేపి నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ మంత్రులు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతుండతున్నారన్నారు. ఈ వర్క్ షాపులో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వర రావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, ఎర్ర శ్రీనివాస రావు, జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ విష్ణు వర్ధన్, బండా రమేష్, ఏం ఏ జబ్బార్, ఎస్ నవీన్ రెడ్డి, షేక్ మీరా సాహెబ్, దొంగల తిరుపతి రావు, మండల కార్యదర్శి భూక్య శ్రీనివాస్, నాగుల మీరా, బత్తిని ఉపేందర్, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు వజినేపల్లి శ్రీనివాస్ , పత్తిపాక నాగ సులోచన తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు