చిన్న మండవ వద్ద మున్నేరులో చిక్కుకున్న ఐదుగురు ... రక్షించాలని మంత్రి తుమ్మల ఆదేశం

Munneru, Khammam

ఖమ్మం జిల్లాలోని చిన్నమండవ ( చింతకాని మండలం ) వద్ద మున్నేరులో గురువారం ఐదుగురు చిక్కుకున్నారు. వీరు గేదలను మేపడానికి వెళ్ళి చిక్కుకున్నట్లు చెలుస్తోంది. వారిని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులకు ఆదేశించారు. ఎన్ డి ఆ ర్ఎఫ్ బృందాలను పంపిం, అందర్నీ క్షేమంగా బయటకు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్, పోలీసులకు సూచించారు. అయితే, మున్నేరులో చిక్కుకున్న వారి వివరాలు తెలియాల్సి వుంది. అంతకు ముందు, తుమ్మల ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుండే జిల్లా కలెక్టర్ అనుదీప్ తో పాటు ఉన్నతాధికారులతో తుమ్మల మాట్లాడారు. ఖమ్మం జిల్లాతో పాటు మున్నేరు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తుమ్మల ఆదేశించారు. గత ఏడాది వరదల వల్ల వందల మంది నిరాశ్రయులయ్యారని, మళ్లీ అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే, తప్పకుండా పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నగరంలోని వెంకటేష్ నగర్, శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్, బొక్కలగడ్డ ప్రాంతాలకు చెందిన ప్రజలను అప్రమత్తం చేయాలని అధికార్లకు సూచించారు. ఎప్పటికప్పుడు మున్నేటి పరిస్థితిని వరద ప్రవాహాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు