ఖమ్మం కార్పోరేషన్ విలీన గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ... మంత్రి తుమ్మల

Thummala Nageswara Rao

ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని,  విలీన గ్రాల్లో మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి శనివారం ఆయన ఖమ్మం నగరంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు. 3వ డివిజన్లో రూ. 50 లక్షలతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు, రూ. 50 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, ఈనాడు బైపాస్ రోడ్డు నుంచి బల్లెపల్లి వరకు కోటి 80 లక్షల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, బల్లేపల్లి ఎస్సీ కాలనీలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ విలీన గ్రామాల్లో అంతర్గత ససీసీ రోడ్ల నిర్మాణం, డ్రైయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి ఇప్పటి వరకు 200 కోట్లరూపాయల విలువ గల పనులు మంజూరు చేశామన్నారు. మరో రూ.150 కోట్లు మేరకు ప్రతిపాదనలు పంపామని, ఆగస్టు 15 నాటికి కనీసం మరో రూ. 100 కోట్లు మన నగరానికి ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు.

280 కోట్లతో కేబుల్ బ్రిడ్జి ... రూ. 160 కోట్లతో మోడల్ మార్కెట్ ... 30 కోట్లతో ఖమ్మం ఖిల్లా రోప్ ... రూ. 200 కోట్లతో భూగర్భ డ్రైనేజీ

ఖమ్మం నగరంలో రూ. 280 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు, రూ. 160 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రూ. 30 కోట్లతో ఖమ్మం ఖిల్లా రోప్ వే పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఖమ్మం నగరంలో భూ గర్భ డ్రైనేజీ కోసం రూ. 200 కోట్ల మంజూరు చేశామని, నగరంలో మరో 220 కోట్లు అమృత్ నిధులు తీసుకొచ్చి త్రాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామనితెలిపారు. మహిళలు రూ. 200 కోట్ల ప్రయాణాలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేశారని, మహిళలు నెలకు సరాసరి 3 వేల రూపాయలు ఆదా చేస్తున్నారని, అందుకు ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు 6,700 కోట్ల రూపాయలు చెల్లించిందని పేర్కొన్నారు. విద్యార్థులకు, యువకులకు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చర్యలు చేపట్టామని, గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీ భారం కూడా అధికంగా ఉందన్నారు. రైతులకు సన్న రకం ధాన్యంపై క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో కూడా సన్నబియ్యం పెడుతున్నామని అన్నారు. పాఠశాలలను మహిళా సంఘాల ద్వారా బాగు చేస్తున్నామని, పిల్లలకు ఏక రూప దుస్తులు మహిళా సంఘాల ద్వారా కుట్టించడం జరిగిందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్, పెట్రోల్ బంకులు వంటి అనుకూలంగా రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల లబ్ధిదారులకు క్రొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహా రావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రంజిత్, మున్సిపల్ ఇఇ కృష్ణలాల్, నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ అనిల్, ఏసీపీ వసుంధర, విద్యుత్ శాఖ డిఇ రామారావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Thummala Nageswara Rao

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు