ఖమ్మంలో కొలువు దీరనున్న కలియుగ దైవం ... తుమ్మల చొరవతో ఆలయ నిర్మాణానికి టీటీడీ నిర్ణయం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఖమ్మంలో కొలువుదీర బోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం
ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మానానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఆలయంతో పాటు పెద్ద కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించేందుకు ఈ ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవతో టీటీడీ అధికార ప్రతినిధి
బృంధం ఇందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా గురువారం ఖమ్మం వచ్చిన టీ.టీ.డీ
ఎస్.ఈ జగదీశ్వర్ రెడ్డి, ఇ .ఇ సురేందర్ నాథ రెడ్డి, ఢీ.ఇ.ఇ నాగభూషణం, ఎలక్ట్రికల్ ఈ.ఈ రవి శంకర్
రెడ్డి,
ఏ ఈ
జగన్మోహన్ రావులతో కూడిన అధికార బృంధం అల్లీపురం, రఘునాధ పాలెం ప్రాంతాల్లో ఆలయ నిర్మాణానికి
అనువైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అధికార బృంధం మంత్రి తుమ్మలను కలిసి ఆలయం, కళ్యాణ మండపాలకు సంబంధించిన
నమూనాలను చూపించారు. నిర్మాణానికి సంబంధించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. తుమ్మల
నాగేశ్వర రావు, టీ.టీ.డీ
చైర్మన్ బీ.అర్.నాయుడుకు చేసిన ఆలయ నిర్మాణం ప్రతిపాదనలకు స్పందించిన టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Post a Comment