దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్
అటవీ భూముల ఆక్రమణ, అధికార్లు, సిబ్బందిపై దాడులు, వాటిపై తప్పుడు వార్తలను సహించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ఈ నెల 16న అటవీ అధికారులు, సిబ్బందిపై దాడి జరిగితే, కొన్ని పత్రికల్లో గిరిజనులపై అటవీ అధికారులు దాడి చేసినట్లు ప్రచురించడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఇటువంటి నకిలీ వార్తలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దాడికి గురైన అధికారి డి. చక్రవర్తి గిరిజన కమ్యూనిటీకి చెందిన వారని వెల్లడించారు. ఘటనలో మహిళలు కొద్ది మంది మాత్రమే వున్నారని, గిరిజనేతరులే ఎక్కువ మంది వున్నారని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా దాడికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు.
ఆ రోజు అటవీ ఆక్రమణల నిరోధానికి తాళ్లగూడెం మహిళా ఫారెస్ట్ సెక్షన్ అధికారి
డి. శిల్ప, బీఆర్.
పురం ఫారెస్ట్ సెక్షన్ అధికారి డి. చక్రవర్తి చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్ లోకి
వెళ్లగా ఆక్రమణ దారులు కారం పొడి కళ్ళలో చల్లుతూ, రాళ్లు రువ్వుతూ, తిడుతూ అధికారులపై
దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనలో అటవీ అధికారులు, సిబ్బందిపై దాడి చేసిన16 మంది
నిందితులపై కేసు ( ఎఫ్ఐఆర్ నెం. 195/2025 ) నమోదు చేయడం జరిగిందన్నారు. 2775
మొక్కల ధ్వంసమై, రూ.
3,91,275 నష్టం కలగడం వల్ల అటవీ
నేరం క్రింద( పిఓఆర్ 10-7/2020 ) ఈ నెల
17న కేసు నమోదు చేశామన్నారు.
ఖమ్మం అటవీ డివిజన్, కారేపల్లి ఫారెస్ట్ రేంజ్, తాళ్లగూడెం సెక్షన్, ఊట్కూరు నార్త్ బీట్ చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్ లోని 50 హెక్టార్లకు పైగా అటవీ భూమిలో 2020 నుండి21మధ్య రూ. 59.54 లక్షల వ్యయంతో మొక్కలు నాటించడం జరిగిందన్నారు. ఎర్రబొడు, మాణిక్యారం గ్రామాలకు చెందిన కొందరు అక్కడ ఏపుగా పెరిగిన 33848 చెట్లను ధ్వంసం చేసి, రూ. 45.30 లక్షల మేర అటవీ శాఖకు నష్టం చేశారని పేర్కొన్నారు. దీనిపై 2022- నుండి 25 మధ్య 40 మందికి పైగా నిందితులపై 8 పిఓఆర్ కేసులు బుక్ చేశామని వెల్లడించారు. అడవులు పర్యావరణ సమతుల్యత కాపాడతాయని, మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయని, భూముల ఆక్రమణ చేయడం, అటవీ అధికారులు, సిబ్బంది పై దాడి చేయడం సరైంది కాదన్నారు. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

.jpeg)

Comments
Post a Comment