అసదుద్ధీన్, అక్భరుద్ధీన్, షబ్బీర్ అలీ బీసీలు ఎలా అవుతారు ? ... బీజేపీ నేత ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్
తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల వల్ల నిజమైన బీసీలు నష్ట పోతారని భారతీయజనతా పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ అన్నారు.
ఇప్పటికే10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారని, మళ్ళీ 42 శాతం
రిజర్వేషన్లలో ముస్లింలను కూడా కలిపితే, బీసీలకు న్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ
రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ధి జరుగుతుందాని, అసదుద్దీన్, అక్భరుద్ధీన్, షబ్బీర్ అలీలు బీసీలు ఎలా
అవుతారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వాళ్ళ పేర్లు కూడా బీసీల
జాబితాలో వున్నాయని, బీసీ
వర్గాల వాస్తవ గణాంకాలను తక్కువ చేసి, ఇతర వర్గాలను బీసీ జాబితాలో చేర్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
శనివారం ఆయన తన పర్యటలో భాగంగా ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్
బీసీల రిజర్వేషన్ల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. బీసీల
హక్కులను తాకట్టు పెట్టి, రాజకీయ లబ్ధి కోసం ప్రయోగాలు చేస్తుందని దువ్వ బట్టారు. గతంలో
కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకల జనుల సర్వేలో బీసీల జనాభా దాదాపు 55 శాతంగా ఉన్నట్టు నివేదికలు వచ్చాయని, అదే తరహాలో ప్రస్తుత
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీ జనాభా తక్కువగా ఎలా నమోదైందో
చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వేలు నిర్వహించింది ఒకే ప్రభుత్వ యంత్రాంగం
అయినప్పుడు,
తేడా ఎందుకొస్తుందని నిలదీశారు. ఇది ఖచ్చితంగా బీసీలను రాజకీయంగా అణచి వేయాలన్న
కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రమాదకర
పరిణామమన్నారు. బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ కపటి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు.
దీని వల్ల బీసీల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం
ఉందని,
బీజేపీ దీన్ని
సహించబోదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం మించ కూడదన్న సుప్రీం కోర్టు
మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం ఓట్ల కోసమే హద్దులు దాటి మాట్లాడటం హాస్యాస్పదంగా
వుందన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి
కోటేశ్వరరావు, నాయకులు
కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ, సన్నె ఉదయ ప్రతాప్, తాండ్ర వినోద్ రావు, నున్న రవి కుమార్, నంబూరి రామ లింగేశ్వర్
రావు,
విజయ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment