చేపలు వేటకు వెళ్లి కట్టలేరులో ముగ్గురు గల్లంతు
ఎర్రుపాలెం మండల పరిధిలోని కట్టలేరుకు చేపల వేటకు వెళ్లి ముగ్గురు
వ్యక్తులు గల్లంతయిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం, మండల పరిధిలోని బంజర
గ్రామానికి చెందిన బాధవత్ రాజు(55) భూక్యా కోటి (46) సాయి (25) కట్టలేరులో చేపల వేటకు
వెళ్లారు. వెళ్ళిన ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం అందుకున్న తహసీల్దార్ ఉషా శారద, మధిర సిఐ మధు, ఎర్రుపాలెం ఎస్సై
రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల
సమాచారంతో ఖమ్మం నుండి ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు మొదలు
పెట్టింది. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు, బంజర గ్రామస్తులు పెద్ద ఎత్తున
కట్టలేరు వద్దకు చేరుకున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ
సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

.jpeg)

Comments
Post a Comment