సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా దండి ... సహాయ కార్యదర్శిగా జమ్ముల
సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా దండి సురేష్, సహాయ కార్యదర్శిగా జమ్ముల జితేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు రోజుల పాటు మధిరలో జరిగిన జిల్లా 23వ మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. మహాసభలో 91 మందితో కౌన్సిల్ను 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో సాంప్రదాయ కమ్యూనిస్టు కుటుంభంలో జన్మించారు. విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో పని చేసిన సురేష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా కూడా పని చేశారు. ప్రస్తుతం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పని చేస్తున్న ఆయన ఈ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి చింతకాని మండలంలోని నాగిలిగొండ గ్రామంలో జన్మించారు. విద్యార్థి యువజన ఉద్యమాలలో పని చేసిన ఆయన, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంలో సుదీర్ఘ కాలం జిల్లా, రాష్ట్ర బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు, నాయకులు భాగం హేమంతరావు, మహమ్మద్ మౌలానా నూతన నాయకత్వాన్ని అభినందించారు.
Comments
Post a Comment