పాఠశాల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి … అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
( తాళ్లూరి అప్పారావు , మధిర ) అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాలో చేపట్టిన సమీకృత గురుకులాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి అయ్యే లాగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన మేధస్సుతో కూడిన మానవ వనరులను అందించడమే యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ లక్ష్యమని చెప్పారు. ప్రపంచ స్థాయి విద్యా బోధన అందించడమే ధ్యేయంగా ఎటువంటి లోటు పాట్లు లేకుండా నాణ్యత ప్రమాణాల మేరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని , ఆకాడమిక్ బ్లాక్ మార్చి లోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు ఇండోర్ , ఔట్ డోర్ ఆటలు ఆడుకునేలా డిజైన్ చేయడం జరిగిందన్నారు. ఈ గురుకులంలోనే టీచింగ్ , నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం క్వార్టర్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో విద్యా శాఖ ఇఇ బుగ్గయ్య , బోనకల్ మండల తహసీల్దార్ రమాదేవి , సంబంధిత శాఖ...