ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా ... కేటీఆర్ ను ఓడించేందుకు హరీష్ రావు డబ్బులు పంపారని ఆరోపణ
ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాధమిక సభ్యత్వానికి తెలంగాణ జాగృతి
అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి స్పీకర్
పార్మెట్లో రాజీనామా చేసి పంపుతున్నట్లు చెప్పారు. అలాగే పార్టీ సభ్యత్వానికి సంబంధిత
పార్టీ వర్గాల ద్వారా కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపుతున్నట్లు తెలిపారు. కవితను
పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె బుధవారం తొలి సారి మీడియా ముందుకు వచ్చి ఈ
ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని హస్త గతం చేసుకొనే
కుట్రలు జరుగుతున్నాయని, కుట్రలు పట్ల అప్రమత్తంగా వుండాలని కేటీఆర్, కేసీఆర్ లను
హెచ్చరించారు. ఇవ్వాళ తనకు ఎదురైన పరిస్థితే, రేపు మీకు ఎదురు కావొచ్చని
ఆందోళన వ్యక్తం చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులను నమ్మొద్దని, పార్టీ హార్డ్ కోర్
కార్యకర్తలను దగ్గరకు చెర దీయాలని సూచించారు. గత ఎన్నికల్లో కేటీఆర్ ను ఓడించడం
కోసం హరీష్ రావు రూ. 60 లక్షలు పంపారని తీవ్రమైన ఆరోపణ చేశారు. అలాగే 25 మంది
ఎమ్మెల్యే అభ్యర్ధులకు సొంతగా డబ్బులు ఇచ్చారని చెప్పారు. ఈ డబ్బులు హరీష్ రావుకు
ఎక్కడవని ఆమె సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డబ్బులే
హరీష్ రావు ఎమ్మెల్యే అభ్యర్ధులకు పంపారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి, హరీష్ రావుకు మధ్య
రహస్య ఒప్పందం వుందన్నారు. ఇద్దరు డిల్లీ విమాన ప్రయాణంలో ఈ ఒప్పందం చేసుకున్నారని
చెప్పారు. ఆ తర్వాతే, తనను
టార్గెట్ చేసి బయటకు పంపారని ఆరోపించారు.
.jpeg)
Comments
Post a Comment