ఆధ్యాత్మిక పర్యటనకు ప్రత్యేక రైలు
( తాళ్లూరి
అప్పారావు - మధిర )
దక్షిణ భారత దేశ ఆలయాల వైభవాన్ని చూసి తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) ప్రత్యేక పర్యాటక రైలును ఏర్పాటు చేసినట్లు ఐ.ఆర్.సి.టి.సి ( IRCTC ) టూరిజం ( Tourism ) అసిస్టెంట్ మేనేజర్
పి.వి వెంకటేష్ తెలిపారు.
సోమవారం మధిర రైల్వే స్టేషన్లో ( Madhira Railway Station ) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తెలుగు రాష్ట్రాల ( Telugu States ) ప్రజల కోసం ఈ నెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు దివ్య దక్షణ యాత్ర జ్యోతిర్లింగం ( Divya Dakshana Yatra Jyothirlingam ) పేరుతో
దక్షిణ భారత దేశ వైభవాన్ని ప్రతిబింబించే ఏడు పవిత్ర క్షేత్రాలను దర్శించుకునేలా
యాత్రను రూపొందించినట్లు పేర్కొన్నారు. యాత్రలో తిరువన్నామలై లోని అరుణాచలేశ్వర
స్వామి ఆలయం, రామేశ్వరంలోని
రామనాథ స్వామి ఆలయం, మధురై
లోని మీనాక్షి అమ్మన్ ఆలయం, కన్యాకుమారిలోని కుమారి అమ్మన్ ఆలయం, తిరువనంతపురంలోని అనంత
పద్మనాభ స్వామి ఆలయం, తిరుచిలోని
శ్రీ రంగనాథ స్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం వరకు ఈ దివ్య దక్షణ యాత్ర
కొనసాగుతుందని వివరించారు. ఈ రైలు 23వ తేదీన సికింద్రాబాద్ లో బయలు దేరి తెలంగాణలోని జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర రైల్వే
స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఈ రైలులో ప్రయాణించే యాత్రికులకు ఐ.ఆర్.సి.టి.సి సిబ్బంది
అన్ని సదుపాయాలు కల్పిస్తారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఐ.ఆర్.సి.టి.సి టూరిజం
మానిటర్లు ప్రశాంత్, మహేందర్
పాల్గొన్నారు.

Comments
Post a Comment