బీఆర్ఎస్ బాటలోనే బీజేడీ
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఒడిశాకు చెందిన ప్రముఖ ప్రాంతీయ పార్టీ బిజూ జనతాదళ్ ( BJD ) నిర్ణయించింది. ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి ( BRS ) ఇదే బాటలో నడుస్తుండగా, తాజాగా BJD కూడా వచ్చి చేరింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్ర ఢిల్లీలో వెల్లడించారు. రేపు జరిగే పోలింగ్‌లో తమ పార్టీ ఎంపీలు ఎవరూ పాల్గొనరని ఆయన స్పష్టం చేశారు.
ఈ అంశంపై పార్టీ ఎంపీలు, రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించిన అనంతరం, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి
నవీన్ పట్నాయక్ ఈ తుది నిర్ణయం తీసుకున్నారని సస్మిత్ పాత్ర తెలిపారు. భారతీయ జనతా
పార్టీ ( BJP ) నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ( NDA ) కూటమికి, కాంగ్రెస్ ( Congress ) సారథ్యంలోని ఇండియన్
నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ ( INDIA ) కూటమికి సమాన దూరం పాటించాలనే
తమ పార్టీ విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ఒడిశా
రాష్ట్ర అభివృద్ధి, 4.5 కోట్ల మంది ప్రజల సంక్షేమంపైనే తమ పూర్తి దృష్టి కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాజ్యసభలో బిజూ జనతాదళ్‌కు ఏడుగురు సభ్యులు ఉన్నారు.
.jpeg)
Comments
Post a Comment