'బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ' ... కామారెడ్డిలోనే ఎందుకు?
తెలంగాణ ( Telangana ) లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కాంగ్రెస్ ( Congress ) పార్టీ బీసీ
ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో
భాగంగా,
బీసీలకు
42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల్లోకి బలంగా
తీసుకెళ్లడానికి ఈ నెల 15న కామారెడ్డిలో 'బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ' ను నిర్వహించనుంది. ఈ
సభ నుంచే స్థానిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
కారణం ఇదే
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి అప్పటి సీఎం కేసీఆర్ ( KCR )పై
రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పోటీ చేశారు. ఆ సమయంలో కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలోనే
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. అధికారంలోకి
వస్తే కుల గణన చేసి, బీసీలకు
రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ, రాష్ట్రంలో కుల గణన
చేపట్టి బీసీ రిజర్వేషన్లను ( BC Reservation ) 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను గవర్నర్
ఆమోదానికి పంపింది. ఏ వేదికపై అయితే హామీ ఇచ్చారో, అదే వేదికపై నుంచి ఈ విజయోత్సవ
సభ నిర్వహించడం ద్వారా బీసీ వర్గాలకు ఒక బలమైన సందేశాన్ని పంపవచ్చని కాంగ్రెస్
భావిస్తోంది.
సభకు హాజరుకానున్న అగ్ర నాయకులు
ఈ సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ), పార్టీ జాతీయ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ
ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యలను ముఖ్య అతిథులుగా
ఆహ్వానిస్తున్నారు. లక్ష మందికి పైగా జన సమీకరణ చేసి, ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర
నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సభ ఏర్పాట్లపై ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు
షబ్బీర్ అలీ నివాసంలో ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు
మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొని జనసమీకరణ, సభా ఏర్పాట్లపై చర్చించారు.
.jpeg)
Comments
Post a Comment