రూ. 87.41 కోట్లకు రాజీవ్ స్వగృహ విక్రయం

Rajiv Swagruha, Khammam

ఖమ్మం ( Khammam ) మున్నేరు ( Munneru ) ఒడ్డున గల రాజీవ్ స్వగృహను ( జలజ టౌన్ షిప్ ) అమ్మేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ సోమవారం ముగిసింది. సుమారు 9.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 8 టవర్లను తెలంగాణా ( Telangana ) గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహకార గృహ నిర్మాణ సంఘం  రూ. 87.41 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ టౌన్ షిప్ విక్రయానికి రెండు నెలల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల ఉద్యోగ సహకార సంఘాలు, బిల్డర్లు, డెవలపర్స్, గ్రూప్ హౌసింగ్ పై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. రూ. 5 కోట్ల ఇఎండీగా నిర్ధారించారు. చదరపు గజానికి నామ మాత్రంగా రూ. 1150 ధరను నిర్ణయించి, ఒకటి  కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ ద్వారా కేటాయించాలనుకున్నారు. అందులో భాగంగా సోమవారం అధికారుల సమక్షంలో నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకున్న తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు రాజీవ్ స్వగృహను కేటాయించినట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి. గౌతం ( V.P Gowtham ) తెలిపారు. ఏదులాపురం ( Edulapuram ) మున్సిపల్ పరిథిలోని పోలేపల్లిలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 576 ఫ్లాట్లు అసంపూర్తిగా ఉన్నాయని, వీటి నిర్మాణం పూర్తైతే, ఈ టౌన్ షిప్ ఖమ్మంలో ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని పేర్కొన్నారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే