ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు ... డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka

( తాళ్లూరి అప్పారావు, మధిర )

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని తెలంగాణ ( Telangana ) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ, పథకాలు ప్రజల హృదయాల్లో ఉన్నాయని అన్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా వుందని చెప్పారు. సోమవారం ఆయన మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ( BRS )పెద్దలు 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేస్తే, ప్రణాళికా ప్రకారం వాటిని సరి చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలకు, మనసులకు బాగా తెలుసన్నారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఇందిరమ్మ ప్రభుత్వం బీసీల దశాబ్దాల కోరికను నెరవేర్చిందన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి హామీలు ఇచ్చి బీఆర్ఎస్ పెద్దలు అమలు చేయలేదన్నారు. లక్ష రూపాయల రైతు రుణ మాఫీని 10 సంవత్సరాల్లో కూడా పూర్తిగా చేయలేక పోయారని విమర్శించారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాలేశ్వరం కూడా కుంగి పోయిందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.  

హామీల్లో 99 శాతం నెరవేర్చాం

కాంగ్రెస్ కాంగ్రెస్ ( Congress ) పార్టీ ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చిందని చెప్పారు. యువతకు గ్రూప్ వన్ గ్రూప్ టుతో పాటు ఇప్పటికే 60,000 ఉద్యోగాలు, 21 వేల కోట్ల రైతు రుణ మాఫీ ( Raithu Runa Mafi ), తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా, 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్తు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సన్న ధాన్యం సాగు చేసే రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గాను రూ. 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు.  రాష్ట్రంలో 1.05 కోట్ల కుటుంబాలు ఉండగా 96 లక్షల కుటుంబాలకు మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ( RTC ) బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం, స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏటా 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసి ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

Mallu Bhatti Vikramarka

భట్టిని కలిసిన ప్రధాన ప్రెస్ క్లబ్ ... భట్టికి సన్మానం

మధిర ( Madhira ) నియోజకవర్గ కేంద్రంలో ప్రధాన పత్రికలు, ప్రధాన చానల్స్ తో నూతనంగా ఏర్పడిన మధిర ప్రధాన ప్రెస్ క్లబ్ ( Press Club ) సభ్యులు సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మధిరలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రెస్ క్లబ్ లో ఏ ఏ ఛానళ్లు, ఏ ఏ పత్రికలు ఉన్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాన మీడియా ప్రెస్ క్లబ్ కమిటీని అడిగి నూతనంగా ఎన్నికైన కమిటీని అభినందించారు. అనంతరం ప్రధాన మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను శాలువా కప్పి బొకే అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పాగి బాలస్వామి, చేకూరి వినోద్, గౌరవ అధ్యక్షులు మక్కెన నాగేశ్వరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు మురళి, కోశాధికారి పళ్ళపోతు ప్రసాద్, గౌరవ సలహాదారులు అట్లూరి సాంబిరెడ్డి, కొంగర మురళి, దనిశెట్టి శెట్టి శ్రీనివాస రావు, మిరియాల శ్రీనివాస రావు, రావిరాల శశి కుమార్, ఉపాధ్యక్షులు సుంకర సీతారాం, రావూరి కృష్ణ ప్రసాద్, సహాయ కార్యదర్శి లు వేములకొండ రాము, దుబాసి రాజేష్, ఎల్ రాజు, కంచి పోగు గణేష్ ప్రచార కార్యదర్శిలు పబ్బతి జగదీష్, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస రావు, వేముల నవీన్, చల్లా శ్రీనివాస రెడ్డి, కటికల శ్యాము, తలారి రమేష్, కే కిషోర్ బాబు, కార్యవర్గ సభ్యులు కందుకూరు నరేష్, కోనా నరసింహారావు, గద్దల కళ్యాణ్, కోట రాకేష్, కోట వెంకట్, ఇరుగు పుల్లారావు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే