గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి ... డిప్యూటీ సీఎం భట్టి

Mallu Bhatti Vikramarka
  • జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
  • మోడల్ నియోజక వర్గంగా మధిర అభివృద్ధి
  • తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు  భట్టి విక్రమార్క
  • ఎర్రుపాలెం మండలంలో సుడి గాలి పర్యటన
  • పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు

( తాళ్లూరి అప్పారావు, మధిర )

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలంగాణ డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం ఆయన మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎర్రుపాలెం ఎస్సీ కాలనీలో రూ. 45 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, పెద్ద గోపవరంలో రూ.12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు, పెద్ద గోపవరం ఎస్సీ కాలనీలో రూ. 85 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, బుచ్చిరెడ్డి పాలెం ఎస్సీ కాలనీలో రూ. 40 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, బనిగండ్లపాడు ఎస్సీ కాలనీలో రూ. 1. 75 కోట్లతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, అయ్య వారిగూడెం ఎస్సీ కాలనీలో రూ. 55 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, భీమవరం గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసారు.

Mallu Bhatti Vikramarka

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. మధిర నియోజకవర్గం ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. శాశ్వత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామానికి ఆధునిక మౌళిక వసతులను పూర్తి స్థాయిలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. నియోజక వర్గ ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాజెక్టులను శర వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం ఆలోచిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

Mallu Bhatti Vikramarka

మధిర నియోజక వర్గ అభివృద్ధి పనులపై సమీక్ష

మధ్యాహ్నం బనిగండ్లపాడులో భోజన విరామం తర్వాత, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి రెవిన్యూ, ఫారెస్ట్, పంచాయతీ రాజ్, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, పర్యాటకశాఖ అధికారులతో  నియోజక వర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వాటిని పూర్తి చేసేందుకు అధికారులు చేపట్టాల్సిన చర్యలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.

Mallu Bhatti Vikramarka

ట్రాక్టర్ పై వెళ్ళి ఇనిద్రమ్మ చెరువు పరిశీలన

ఈ సందర్భంగా ఎర్రుపాలెం మండలంలోని మామునూరులో ఇనిద్రమ్మ చెరువును డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ లతో కలిసి ప్రత్యేకంగా ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు. పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టికి వివిధ గ్రామాల ప్రజలు డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ఈ పర్యటనలో తెలంగాణ హస్త కళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డీపీఓ ఆశాలత, పంచాయతీ రాజ్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబు, ఎన్పీడీసీఎల్  ఎస్ఇ శ్రీనివాసా చారి, ఎర్రుపాలెం మండల తహసీల్దార్ ఎం. ఉషా శారద తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే