ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేయండి ... డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

Mallu Bhatti Vikramarka

వారం రోజుల పాటు ఖమ్మం ( Khammam ) జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులను వైద్య అధికారులు తనిఖీ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) ఆదేశించారు. కనీస అవసరాలు, ట్రీట్మెంట్, ప్రోటోకాల్ పద్ధతి, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమ, నిబంధనలు ప్రైవేట్ ఆసుపత్రులు ( Private Hospitals ) పాటిస్తున్నాయా ? లేదా ? అన్నది చూడాలన్నారు. ముఖ్యంగా ప్రజలకు సరైన వైద్యం అందించని, కనీస వసతులు లేని, ప్రజల నుండి ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులను తనిఖీ చేసి రూల్స్ కు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఆయన ఖమ్మం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ తో కలిసి వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు, ఆసుపత్రులు ఆధునిక సౌకర్యాలతో పాటు క్లినికల్ ఎష్టాబ్లీష్మెంట్ చట్టం ప్రకారం నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. పేషంట్ కు, పేషంట్ తో పాటు వచ్చే వారికి ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య సేవలకు, సర్జరీలకు తీసుకునే చార్జెస్ ను రాక్ రేట్స్ చార్ట్ ప్రజలకు కనపడే విధంగా అందుబాటులో ఉంచాలన్నారు. ఆరోగ్యశ్రీ ( Arogya Sri ) ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఎన్ని అవాంతరాలొచ్చినా, కో-ఆర్డినేటర్ల ద్వారా మానిటరింగ్ చేస్తూ కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించిందని చెప్పారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, 627 ప్రైవేట్ ఆసుపత్రులు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో  అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.బి.కళావతి బాయి, గవర్నమెంట్ హాస్పటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా.నరేందర్, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ. డా.చందు నాయక్, ఆరోగ్యశ్రీ జిల్లా మానేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే