సమాజాభివృద్ధిలో జర్నలిస్టులది కీలక పాత్ర … అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని
( తాళ్లూరి అప్పారావు, మధిర )
సమాజాభివృద్ధిలో జర్నలిస్టులది కీలక పాత్రని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhtti Vikramarka ) సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని అన్నారు. ఆదివారం స్థానిక పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన మధిర ప్రెస్ క్లబ్ ( Press Club ) నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటికి పరిష్కారం చూపడంలో జర్నలిస్టుల ది కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు విలువలతో కూడిన వార్తలను ప్రజలకు అందించినప్పుడే విశ్వసనీయత పెరుగుతుందన్నారు. మల్లు భట్టి విక్రమార్క గెలుపుకు మధిర నియోజకవర్గ జర్నలిస్టులు ( Journalists ) తనకు ఎంతో సహకరించారని, వారి సహకారాన్ని ఎప్పుడూ మరవమన్నారు. జర్నలిస్టుల సమస్యలను ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ కు, జర్నలిస్టులకు వ్యక్తిగతంగా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
మధిర( Madhira ) ప్రెస్ క్లబ్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా మక్కెన నాగేశ్వరరావు, అధ్యక్షులుగా పాగి బాలస్వామి, కార్యదర్శిగా చేకూరి వినోద్, కోశాధికారిగా పల్లపోతు ప్రసాద రావు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ శ్రీకరం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీడీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవి బాబు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహా రావు, మధిర సిటీ కేబుల్ నిర్వాహకులు తుళ్లూరు శ్రీనివాస రావు, బీజేపీ మధిర నియోజకవర్గ కన్వీనర్ ఏలూరు నాగేశ్వర రావు, శ్రీకృష్ణ ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకులు కూరపాటి సునీల్ మాదిగ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మిర్యాల రమణ గుప్త, సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి పడకంటి మురళి, పీర్టీయు నాయకులు ఆర్ రంగారావు, ఆర్ బ్రహ్మారెడ్డి, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాగూర్ వలి తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment