Posts

Showing posts from May, 2025

అది కేసీఆర్ కుటుంబంలో కుంపటి

Image
  ఆస్తి పంపకాల్లో తేడా వచ్చి రోడ్డున పడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పేవన్నీ వాస్తవాలు బీఆర్ఎస్ , బీజేపీ లోపాయికారి ఒప్పందాలు బయట పడ్డాయి రాజాసింగ్ ప్రశ్నలకు ఆ రెండు పార్టీలు సమాధానం చెప్పాలి కొత్తగూడెం పర్యటనలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కల్వకుంట్ల కవిత వ్యవహారం కేసీఆర్ కుటుంబంలో కుంపటని , ఆస్తి పంపకాల్లో తేడా వచ్చి రోడ్డున పడ్డారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసానిలో జరిగిన కాంగ్రెస్ ఆదివాసీ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ వుండడన్నారు. ఇప్పుడు కవిత వెల్లడించే విషయాలు వాస్తవాలని పేర్కొన్నారు. బీజేపీతో వారికున్న లోపాయికారి ఒప్పందాలను కవిత బహిర్గతం చేశారని చెప్పారు. రాజాసింగ్ కూడా కొన్ని ప్రశ్నలు సంధించారని , వాటన్నిటికీ ఇటు బీఆర్ఎస్ , అటు బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం వుందన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా వుండి కూడా యువ మోర్చా నాయకుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో వుండి రాష...

ప్రపంచ వ్యాప్తంగా సింగరేణిని విస్తరిస్తాం

Image
  క్రిటికల్ మినరల్స్ వెలికి తీస్తాం అవకాశాలపై అధ్యయనానికి కమిటీ వేశాం నివేదిక రాగానే కార్యాచరణ ప్రణాళిక రాష్ట్రంలో కొత్త బొగ్గు గనులు ప్రారంభిస్తాం కొత్త గనుల్లో 22 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రపంచ వ్యాప్తంగా సింగరేణిని విస్తరిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం ఆయన సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంతో పాటు వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ 100 సంవత్సరాల అనుభవం గల సింగరేణి , దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బొగ్గుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు వున్న అవకాశాలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఒక కమిటీని నియమించామన్నారు. ఈ అధ్యయనం పూర్తైన తర్వాత , సింగరేణిని పూర్తి స్థాయిలో విస్తరించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తామని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో కొత్త బొగ్గు గనులను కూడా ప్రారంభిస్తామన్నారు. కొత్తగూడెం , ఇల్లెందుతో...

పాఠశాలలో మంత్రి పొంగులేటి శ్రమదానం

Image
మొక్కను నాటిన మీనాక్షి నటరాజన్ పాల్వంచ మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రమదానం చేశారు. పొంగులేటి స్వయంగా ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి , చెత్తను ఎత్తి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి , మహబూబా బాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ , పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు , అశ్వారావు పేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ , డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. Janechcha

గిరిజనుల హక్కులు, ఆత్మ గౌరవాన్ని కాపాడుతాం

Image
  సంక్షేమ పథకాలపై కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయాలి త్వరలో లబ్దిదారుల జాబితాలు గ్రామాలకు పంపుతాం   ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. 17 , 169 కోట్లు కేటాయించాం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఫారెస్ట్ రైట్స్ యాక్టు తెచ్చాం పోడు రైతులకు 6.70 లక్షల ఎకరాలిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే వాటిని ఇందిరా సౌర గిరి జల వికాసంతో అభివృద్ధి చేస్తోంది మేమే గిరిజన సమ్మేళనంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గిరిజనుల హక్కులు , ఆత్మ గౌరవాన్ని కాపాడుతామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. ఆత్మగౌరవం , సమ సమాజం స్థాపన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని , అందుకు అనుగుణంగానే పథకాలను ప్రవేశ పెట్టామని చెప్పారు. శనివారం ఆయన పాల్వంచ మండలంలోని కిన్నెరసానిలో మూడు రోజులుగా జరుగుతున్న ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనం ( శిక్షణా తరగతులు ) లో ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని భట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఊరూరా ... ఇంటింటికీ ఈ ప్రచారం చేరాలన్నారు. త్వరలో ఏ ఇంటికి ఏ పథకాల...

అందుకే నేను రెండు సార్లు ఓడిపోయా ...

Image
అడవిని నరకటం దేశద్రోహం కంటే ఎక్కువ నరకొద్దన్నందుకే నన్ను రెండుసార్లు ఓడించారు అడవిని నరికితే ఫారెస్ట్ అధికార్లే బాధ్యత వహించాలి పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించాలి టూరిజం ఉంటేనే   దేశాలు అభివృద్ధి చెందుతాయి పులి గుండాల అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల అడవిని నరకటం దేశద్రోహం కంటే ఎక్కువని , ఆలాంటి వారిని ఉపేక్షించేది లేదని , అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్ , సహకార , చేనేత , జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హెచ్చరించారు. అడవిని నరకొద్దన్నందుకే గతంలో   రెండు సార్లు తాను ఓడిపోయానని , ఓడి పోయినా ఫర్యాలేదు కానీ అడవిని నరకొద్దని , నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికార్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కనకగిరి అర్బన్ ఫారెస్ట్ పులి గుండాల‌ ప్రాజెక్టు వద్ద ఏకో టూరిజం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ , పోలీస్ కమిషనర్ సునీల్ దత్ , సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో   కలిసి పరిశీలించారు. పర్యాటకుల రవాణా కోసం నూతనంగా ఏర్పాటు చేసిన వన విహారి బస్సు ను మంత్రి ఈ ...

వైరా బ్రిడ్జిపై ఘోర ప్రమాదం ... ఆరుగురికి గాయాలు

Image
  వైరా నది హై లెవెల్ బ్రిడ్జిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే , అదృష్ట వశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగ లేదు. స్థానికుల కధనం ప్రకారం , మొదట తల్లాడ వైపు 20 ఎంఎం ఇనుప రాడ్ల లోడ్ తో వెళుతున్న లారీ , ఎదురుగా కొబ్బరి బోండాల లోడుతో వస్తున్న వ్యాన్ ను బ్రిడ్జిపై ఢీకొట్టింది. కానీ , బ్రిడ్జి గైడ్ రైల్స్ కు తగిలి వ్యాన్ బ్రిడ్జి క్రింద పడకుండా ఆగి పోయింది. ఆ వెంటనే , అదే లారీ విస్సన్న పేట మండలంలోని తెల్ల దేవర పల్లి నుండి వైరా మండలంలోని రెబ్బవరం గ్రామానికి వెళుతున్న కారును ఆ బ్రిడ్జిపైనే ఢీకొట్టింది. దీంతో లారీ , కారు బ్రిడ్జిపై నుండి 50 అడుగుల లోతులోని వైరా నదిలో పడి పోయాయి. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోవడంతో తీవ్రగాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న మొగిలి శెట్టి రాజశేఖర్ , అతని భార్య గీత , కూతురు జ్యోత్స్న , కుమారుడు తేజెస్లకు స్వల్ప గాయాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్ కూడా స్వల్పంగా గాయ పడ్డాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయినప్పటికీ , మున్సిపాలిటీ డంపు చేసిన చెత్తలో కూరుకు పోవడంతో అందులో ప్రయాణిస్తున్న మొగిలి శెట్టి రాజశేఖర్ కుటుంబం స్వల్ప గాయాలతో బయట పడ...

లొంగి పోయిన 17 మంది మావోయిస్టులు

Image
ఇప్పుడు మావోలకు కర్రెగుట్టలు సేఫ్ జోన్ కాదు అందరూ లొంగి పోవాలని ఎస్పీ రోహిత్ రాజు పిలుపు   17 మంది నిషేధిత మావోయిస్టు పార్టీ దళ సభ్యులు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగి పోయారు. ‘ ఆపరేషన్ చేయుత ’ లో భాగంగా వీరు లొంగి పోయినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. లొంగి పోయిన వారిలో ఆరుగురు మహిళలు , పదకొండు మంది పురుషులు వున్నారు. వీరంతా చత్తీష్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన వారు. ఈ సందర్భంగా రోహిత్ రాజు మాట్లాడుతూ కర్రెగుట్ట మావోయిస్టులకు ఇప్పుడు సేప్ జోన్ కాదని , అందరూ దళాన్ని వీడి జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపు నిచ్చారు. లొంగి పోయిన వారికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గడచిన 6 నెలల్లో జిల్లా వ్యాప్తంగా 282 మంది మావోయిస్టులు లొంగి పోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లొంగి పోయిన మావోయిస్టులు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు. Janechcha

పట్టుబడ్డ రూ. 4.15 కోట్ల విలువైన గంజాయి

Image
  ఇద్దరి అరెస్ట్ , మరో ఎదుగురిపై కేసులు 830.540 కేజీల గంజాయి స్వాధీనం వాహన తనిఖీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సుమారు రూ. 4.15 కోట్ల విలువైన నిషేదిత గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం బుధవారం కోర్జుకు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు , పోలీసులు జూలూరు పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపురం గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా అటుగా వచ్చిన ఐసర్ వాహనాన్ని తనిఖీ చేయగా 830.540 కేజీల గంజాయి బయట పడింది. దీని విలువ సుమారు రూ. 4 , 15 , 27 , 000 వుంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా వాహనంలో వున్న బస్రామ్ , S/o. పూల్ సింగ్ , రామ్ కుమార్ @ రామ్ కుమార్ అజారయ్య , S/O. చెదలాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుండి నిషేదిత గంజాయిని తీసుకొని భద్రాచలం , కొత్తగూడెం , ఖమ్మం , హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నారు. గంజాయి తరలిస్తూ రెడ్ హ్...

కలెక్టరైనా ... భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు

Image
  పండండి మగ బిడ్డకు జన్మనిచ్చిన శ్రద్ధ జీతేష్ వి పాటిల్ పలువురుకు ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ జీతేష్ వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. తాను ఉన్నతమైన పదవిలో వున్నా , ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా తన భార్యకు ఓ సాధారణ వైద్య విధాన పరిషత్ కు చెందిన కమ్యునిటీ హెల్త్ సెంటర్లో కాన్పు చేయించారు. కలెక్టర్ సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్ బుధవారం పండంటి మగ బిడ్డకు జన్మ నిచ్చారు. ప్రస్తుతం తల్లీ , బిడ్డ ఆరోగ్యంగా వున్నారు. కలెక్టర్ దంపతులకు ఇంతకు ముందు తోలి కాన్పులోనూ మగ బిడ్డ పుట్టాడు. సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్ కొంత కాలంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకొని , మందులు వాడుతున్నారు. డి.సి.హెచ్. ఎస్ డాక్టర్. రవిబాబు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం కలిగించడం కోసం కలెక్టర్ పాటిల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్యకు కాన్పు చేయించారు. కలెక్టర్ నిర్ణయాన్ని పలువురు అభినంధిస్తున్నారు .  

సిద్దాంతాన్ని చంపేయడం అమిత్ షా తరం కాదు

Image
  మావోయిస్టుల పేరుతో అమాయకులను చంపుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు మోడీ మోకారిల్లుతున్నాడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అమిత్ షా ప్రకటించినట్లుగా మావోయిస్టు నిర్మూలన 2026 మార్చి 31 కాదు కదా , ఎన్నటికి అది సాధ్యం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తేల్చి చెప్పారు. సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న కొంత మందిని హత్య చేయడం సాధ్యమేమో కానీ , సిద్ధాంతాన్ని చంపేయడం అంత తేలిక కాదన్నారు. మావోయిస్టుల పేరుతో అమాయక గిరిజనుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో మావోయిస్టులు సైతం తమ పంథాను మార్చుకోవాలని సూచించారు. గిరిప్రసాద్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలోని గిరిప్రసాద్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రిక్కాబజార్ హైస్కూల్ మైదానంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ నాడు సాయుధ పోరాటంలో వేల మందిని హతమార్చారని , గిరిప్రసాద్ ము సైతం హత మార్చాలని ప్రయత్నించినప్పుడు తుపాకి గుండుకు ఎదురొడ్డి నిలిచారని నారాయణ తెలిపారు. ఈ దేశంలో టెర్రరిస్టుల పట్ల మోడీ మెతక వైఖరిని అవలంభిస్తూ మావోయిస్టుల హత మార్చే...

పుచ్చలపల్లి స్ఫూర్తితో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం

Image
  సీపీఎం నేతలు పోతినేని , నున్న ఖమ్మం నగరంలో భారీ ర్యాలీ రానున్న కాలంలో మహానేత పుచ్చలపల్లి సుందరయ్య చూపిన మార్గంలో పయనిస్తూ , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు , ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు అన్నారు. సోమవారం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సీపీఎం ఖానాపురం హవేలీ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు క్రాస్ రోడ్ నుండి ఇందిరా నగర్లోని పార్టీ ఆఫీస్ వరకు ఎర్రదండు కవాతు నిర్వహించచారు. అనంతరం దొంగల తిరుపతి రావు అధ్యక్షతన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ నేడు భారత దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటుందని , ఈ పరిస్థితులకు కేంద్రంలో వున్న మోడీ ప్రభుత్వమే కారణమన్నా రు . దేశంలో శాంతి భద్రతలు అదుపులో లేకుండా చేసి దేశంలో ఉన్న ప్రజలను హిందూ ముస్లింలుగా విభజించి మత కల్లోలాలు సృష్టించటం కోసం ఉగ్రవాదాన్ని అడ్డంపెట్టుకున్నారని ఆరోపించారు. ఈ టెర్రరిస్టు దాడులకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో వామపక...

జాబ్ మేళాపై విస్తృత ప్రచారం చేయాలి

Image
  వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్ ఈ నెల 24న నిర్వహించే జాబ్ మేళాపై సమావేశం ఈ నెల 24న వైరా మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాపై విస్తృత ప్రచారం చేయాలని వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్ అన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజక వర్గ పరిధిలోని అధికార్ల సమావేశంలో మాట్లాడారు. వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 80 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని , 5000 ఉద్యోగాలు యువతకు లభించే అవకాశం వుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొనేందుకు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని అధికార్లకు సూచించారు. నియోజక వర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ , టిపిసిసి కార్యదర్శి నూతి సత్యనారాయణ , వైరా మండల పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి , నాయకులు దొడ్డ పుల్లయ్య , స్వర్ణ నరేందర్ , పమ్మి అశోక్ , బోళ్ళ గంగారావు , వీరంశెట్టి సీతారాములు , కంభంపాటి సత్యనారాయణ , కట్ల సాయి , వేల్పుల భ...

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Image
  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఈ నెల 22 నుండి 27 వరకు 24 కేంద్రాల్లో పరీక్షలు ఈ సారి ఆదివారం కూడా పరీక్ష వుంటుందని వెల్లడి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్   అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో   సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుండి 27 వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు , రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈసారి ఆదివారం కూడా పరీక్ష నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు   మొత్తం 7635 మంది విద్యార్థులు హాజరు కానుండగా , 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని   అధికార్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వ...