లొంగి పోయిన 17 మంది మావోయిస్టులు

SP Rohith Raju


  • ఇప్పుడు మావోలకు కర్రెగుట్టలు సేఫ్ జోన్ కాదు
  • అందరూ లొంగి పోవాలని ఎస్పీ రోహిత్ రాజు పిలుపు 

17 మంది నిషేధిత మావోయిస్టు పార్టీ దళ సభ్యులు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగి పోయారు. ఆపరేషన్ చేయుతలో భాగంగా వీరు లొంగి పోయినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. లొంగి పోయిన వారిలో ఆరుగురు మహిళలు, పదకొండు మంది పురుషులు వున్నారు. వీరంతా చత్తీష్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన వారు. ఈ సందర్భంగా రోహిత్ రాజు మాట్లాడుతూ కర్రెగుట్ట మావోయిస్టులకు ఇప్పుడు సేప్ జోన్ కాదని, అందరూ దళాన్ని వీడి జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపు నిచ్చారు. లొంగి పోయిన వారికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గడచిన 6 నెలల్లో జిల్లా వ్యాప్తంగా 282 మంది మావోయిస్టులు లొంగి పోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లొంగి పోయిన మావోయిస్టులు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే