ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

 

Bhadradri Kothagudem Colector

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
  • ఈ నెల 22 నుండి 27 వరకు 24 కేంద్రాల్లో పరీక్షలు
  • ఈ సారి ఆదివారం కూడా పరీక్ష వుంటుందని వెల్లడి

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుండి 27 వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈసారి ఆదివారం కూడా పరీక్ష నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు  మొత్తం7635 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని  అధికార్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం పరీక్షల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్  రవాణా సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్ కో అధికార్లను ఆదేశించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరే విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు ప్రారంభ సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయినుంచిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షలు పూర్తైన తర్వాత జవాబు పత్రాల బండల్లను పోస్టల్ శాఖ తమ ఆధీనంలోకి తీసుకుని ఎలాంటి లోటు పాట్లకు తావు లేకుండా నిర్ణీత ప్రాంతాలకు జాగ్రత్తగా చేర్చా లన్నారు. పరీక్షలు సజావుగా కొనసాగేలా అందరు సమన్వయంతో పని చేయాలని అధికార్లకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఎగ్జామ్ సెంటర్లలో నియమిస్తూ, ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులను  కలెక్టర్  ఆదేశించారు.  అన్ని పరీక్ష కేంద్రాల్లో సీ. సీ. కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. వేసవి దృశ్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి వసతి  ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో  జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి సిహెచ్ వెంకటేశ్వర రావు, టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి, డిప్యూటీ డిఎంహెచ్వో జయలక్ష్మి, పోలీస్ శాఖ నుండి ఎస్ బి ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్,  ట్రాన్స్ కో, పోస్టల్ శాఖ ఏ ఎస్ పి చిన్న యాకయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్ అహ్మద్, జిల్లా పంచాయతీ కార్యాలయం నుండి రమణా రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే