జాబ్ మేళాపై విస్తృత ప్రచారం చేయాలి

 

MLA Ramdas Naik

  • వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్
  • ఈ నెల 24న నిర్వహించే జాబ్ మేళాపై సమావేశం

ఈ నెల 24న వైరా మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాపై విస్తృత ప్రచారం చేయాలని వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్ అన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజక వర్గ పరిధిలోని అధికార్ల సమావేశంలో మాట్లాడారు. వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 80 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 5000 ఉద్యోగాలు యువతకు లభించే అవకాశం వుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొనేందుకు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని అధికార్లకు సూచించారు. నియోజక వర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, టిపిసిసి కార్యదర్శి నూతి సత్యనారాయణ, వైరా మండల పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, నాయకులు దొడ్డ పుల్లయ్య, స్వర్ణ నరేందర్, పమ్మి అశోక్, బోళ్ళ గంగారావు, వీరంశెట్టి సీతారాములు, కంభంపాటి సత్యనారాయణ, కట్ల సాయి, వేల్పుల భరత్ ,గద్దె మల్లికార్జున, నాగవోయిన కృష్ణా, తోటకూర గోపి, రావూరి అజయ్ తదితర గార్లు పాల్గొన్నారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే