సిద్దాంతాన్ని చంపేయడం అమిత్ షా తరం కాదు
- మావోయిస్టుల పేరుతో అమాయకులను చంపుతున్నారు
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు మోడీ మోకారిల్లుతున్నాడు
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
అమిత్ షా ప్రకటించినట్లుగా మావోయిస్టు నిర్మూలన 2026 మార్చి 31 కాదు కదా, ఎన్నటికి అది సాధ్యం
కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తేల్చి చెప్పారు. సిద్ధాంతాన్ని
ఆచరిస్తున్న కొంత మందిని హత్య చేయడం సాధ్యమేమో కానీ, సిద్ధాంతాన్ని చంపేయడం అంత
తేలిక కాదన్నారు. మావోయిస్టుల పేరుతో అమాయక గిరిజనుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు.
అదే సమయంలో మావోయిస్టులు సైతం తమ పంథాను మార్చుకోవాలని సూచించారు. గిరిప్రసాద్ 29వ
వర్ధంతి సందర్భంగా ఆయన ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలోని గిరిప్రసాద్ విగ్రహానికి పూల
మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రిక్కాబజార్ హైస్కూల్ మైదానంలో పార్టీ జిల్లా
సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ నాడు సాయుధ
పోరాటంలో వేల మందిని హతమార్చారని, గిరిప్రసాద్ ము సైతం హత మార్చాలని ప్రయత్నించినప్పుడు
తుపాకి గుండుకు ఎదురొడ్డి నిలిచారని నారాయణ తెలిపారు. ఈ దేశంలో టెర్రరిస్టుల పట్ల
మోడీ మెతక వైఖరిని అవలంభిస్తూ మావోయిస్టుల హత మార్చేందుకు మాత్రం సరి హద్దు
సైన్యాలను దింపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మేము శాంతి చర్చలకు సిద్ధంగా
ఉన్నామని చెబుతున్నా ఎందుకు చర్చలు జరపడం లేదన్నారు. ప్రశ్నించే వారిని చంపేస్తూ
నియంత పాలన వైపు మోడీ అడుగులేస్తున్నారని, ఇది దేశానికి అత్యంత
ప్రమాదకరమన్నారు. మేము యుద్ధం వద్దంటే దేశ ద్రోహులన్నారని మరి యుద్ధం ఆపిన మోడీ
సర్కార్ ను ఏమనాలని నారాయణ ప్రశ్నించారు. ఈ దేశ రాజ్యాంగానికి మావోయిస్టుల నుంచి
కానీ, మరే ఇతరుల నుంచి కానీ
ప్రమాదం లేదని, ఆ ప్రమాదం బీజేపీ వైపు నుంచి మాత్రమే పొంచి
ఉందన్నారు. ఈ దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల పైన మోడీ, అమిత్ షా లే దాడి
చేస్తున్నారని,
సుప్రీం కోర్టును ప్రశ్నించింది కూడా ఉప రాష్ట్రపతి, బీజేపీ వారేనని పేర్కొన్నారు. ఫెడరల్
వ్యవస్థను ధ్వంసం చేస్తూ దేశంలో లౌకిక, ప్రజాతంత్ర శక్తుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారని అన్నారు.
ఈ దేశంలో కులగణన 2029 నాటికి పూర్తి చేయాలని ఈ దేశ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని
నారాయణ డిమాండ్ చేశారు. ఒక పక్క పన్నుల భారం మోపుతూ ప్రజలను ఇబ్బందులు
పెడుతున్నారని, మరో
పక్క గుజరాత్కు చెందిన ఆర్థిక టెర్రరిస్టులు రూ. 16 లక్షల కోట్లు ఎగవేస్తే ఈ మోడీ
ప్రభుత్వం ఏమి చేసిందన్నారు. 29 మంది ఆర్ధిక టెర్రరిస్టుల్లో 28 మంది గుజరాత్ వారేనని, అందులో ఏడుగురు మోడీ
ఇంటి పేరు కలిగిన వారేనని నారాయణ తెలిపారు. ఆర్థిక ఉగ్రవాదులు టెర్రరిస్టుల కంటే
ప్రమాదమని ఆయన అన్నారు. నియంత పాలనకు ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజా చైతన్యానికి కృషి
జరగాలని, వామపక్ష లౌకికశక్తుల
ప్రత్యామ్నాయం మాత్రమే దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడగలదన్నారు.
రాజకీయం వ్యాపారమైందని రాజకీయ పార్టీల్లో అంతర్గత విబేధాలను సృష్టించి లబ్ది పొందేందుకు
బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న ప్రస్తుత
పరిస్థితుల్లో వామపక్ష ఉద్యమం బలపడాలని నారాయణ అన్నారు.
మావోయిస్టులు ఈ దేశ పౌరులు కారా ?
- వామపక్ష లౌకిక శక్తుల ఐక్యతే సరైన ప్రత్యామ్నాయం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కూనంనేని సాంబశివ తావు
సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మావోయిస్టులు
ఈ దేశ పౌరులు కారా ? శాంతి
చర్చలకు సిద్దమంటే ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నించే
వారిని బిజెపి ప్రభుత్వం హత మారుస్తుందని ఆయన ఆరోపించారు. నాడు నైజం రక్కసి మూకలు
ఐదువేల మందిని హతమార్చారని, అప్పుడు నిజాం
ప్రభుత్వం ఏవిధంగా పట్టుకొచ్చి కాల్చి చంపిందో, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అదే
పంథాను అనుసరిస్తుందన్నారు. నేరస్తులు, ఆర్థిక అరాచవాదులు సమాజంలో పెద్ద మనుషులుగా చెలమణి
అవుతుంటే ప్రశ్నించే వారు ఏదో ఒక రూపంలో చంపబడటమో, జైళ్లలో ఉండటమో జరుగుతుందని అన్నారు.
అమిత్ షా దాహం ఎంత మందిని చంపితే తీరుతుందని కూనంనేని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి
బండి సంజయ్ సైతం మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదంటున్నారని, పని చేయాలనుకున్న
ఆలోచనను,
సిద్ధాంతాన్ని
చంపేయడం ఎవరి తరం కాదన్నారు. ఈ దేశంలో అతిపెద్ద క్రిమినల్గా చెప్పుకునే అమితే
ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగ భద్రత గురించి మాట్లాడటం -విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
కామ్రేడ్ గిరిప్రసాద్ లాంటి అనేక మంది
యోధుల వారసత్వంతో ప్రజా పోరాటాలకు సిద్దం కావాలని కూనంనేని పిలుపునిచ్చారు. ఈ సభలో
సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంత రావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్
చైర్మన్ మహ్మద్ మౌలానా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
తదితరులు ప్రసంగించారు.


Comments
Post a Comment