పట్టుబడ్డ రూ. 4.15 కోట్ల విలువైన గంజాయి
- ఇద్దరి అరెస్ట్, మరో ఎదుగురిపై కేసులు
- 830.540 కేజీల గంజాయి స్వాధీనం
వాహన తనిఖీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సుమారు రూ. 4.15 కోట్ల
విలువైన నిషేదిత గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి
జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం బుధవారం కోర్జుకు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు, పోలీసులు జూలూరు పాడు పోలీస్
స్టేషన్ పరిధిలోని నర్సాపురం గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో
భాగంగా అటుగా వచ్చిన ఐసర్ వాహనాన్ని తనిఖీ చేయగా 830.540 కేజీల గంజాయి బయట పడింది.
దీని విలువ సుమారు రూ. 4,15,27,000 వుంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా వాహనంలో వున్న బస్రామ్, S/o. పూల్ సింగ్, రామ్ కుమార్ @ రామ్
కుమార్ అజారయ్య, S/O. చెదలాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి
చెందిన వారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా
మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుండి నిషేదిత గంజాయిని తీసుకొని
భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా
ఢిల్లీకి తరలిస్తున్నారు. గంజాయి తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డ ఇద్దరు నిందితులతో
పాటు గంజాయి కొనుగోలు చేసిన, అమ్మిన మరో ఆరుగురిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
గంజాయి అక్రమ రవాణాను సమర్ధవంతంగా అడ్డుకుని నిందితులను దాకచక్యంగా పట్టుకున్న
జూలూరుపాడు సీఐ ఇంద్రసేనా రెడ్డి, ఎస్సై రవి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సై ప్రవీణ్, సిబ్బందిని ఎస్పీ
రోహితి రాజు అభినందించారు.

Comments
Post a Comment