అది కేసీఆర్ కుటుంబంలో కుంపటి
- ఆస్తి పంపకాల్లో తేడా వచ్చి రోడ్డున పడ్డారు
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పేవన్నీ వాస్తవాలు
- బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాలు బయట పడ్డాయి
- రాజాసింగ్ ప్రశ్నలకు ఆ రెండు పార్టీలు సమాధానం చెప్పాలి
- కొత్తగూడెం పర్యటనలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్
కల్వకుంట్ల కవిత వ్యవహారం కేసీఆర్ కుటుంబంలో కుంపటని, ఆస్తి పంపకాల్లో తేడా
వచ్చి రోడ్డున పడ్డారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసానిలో జరిగిన కాంగ్రెస్ ఆదివాసీ
సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్
రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ వుండడన్నారు. ఇప్పుడు కవిత వెల్లడించే
విషయాలు వాస్తవాలని పేర్కొన్నారు. బీజేపీతో వారికున్న లోపాయికారి ఒప్పందాలను కవిత
బహిర్గతం చేశారని చెప్పారు. రాజాసింగ్ కూడా కొన్ని ప్రశ్నలు సంధించారని, వాటన్నిటికీ ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ సమాధానం
చెప్పాల్సిన అవసరం వుందన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా వుండి కూడా యువ మోర్చా
నాయకుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో వుండి రాష్ట్రాన్ని
దోచుకుంటే,
ఏటీఎంలంటూ కేంద్రంలోని బీజేపీ నాయకులు స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప, ఎప్పుడూ చర్యలు
తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, జరిగిన అవినీతిపై
కమీషన్లు వేసి చర్యలకు పూనుకుంటున్నామన్నారు. మీరు మీరు లోపాయికారి ఒప్పందంలో
వుండి ప్రజా ధనాన్ని లూటీ చేయడం వాస్తవం కాదా ? అని కేంద్ర మంత్రులు బండి
సంజయ్, కిషన్ రెడ్డిలను ఈ
సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు.

Comments
Post a Comment