పుచ్చలపల్లి స్ఫూర్తితో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం
- సీపీఎం నేతలు పోతినేని, నున్న
- ఖమ్మం నగరంలో భారీ ర్యాలీ
రానున్న కాలంలో మహానేత పుచ్చలపల్లి సుందరయ్య చూపిన మార్గంలో పయనిస్తూ, కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు బలమైన ప్రజా ఉద్యమాన్ని
నిర్మిస్తామని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
సుదర్శన్ రావు, ఖమ్మం
జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు అన్నారు. సోమవారం కమ్యూనిస్టు ఉద్యమ
నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సీపీఎం ఖానాపురం హవేలీ కమిటీ
ఆధ్వర్యంలో ఇల్లందు క్రాస్ రోడ్ నుండి ఇందిరా నగర్లోని పార్టీ ఆఫీస్ వరకు ఎర్రదండు
కవాతు నిర్వహించచారు. అనంతరం దొంగల తిరుపతి రావు అధ్యక్షతన బహిరంగ సభలో వారు
మాట్లాడుతూ నేడు భారత దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటుందని, ఈ పరిస్థితులకు
కేంద్రంలో వున్న మోడీ ప్రభుత్వమే కారణమన్నారు. దేశంలో శాంతి భద్రతలు
అదుపులో లేకుండా చేసి దేశంలో ఉన్న ప్రజలను హిందూ ముస్లింలుగా విభజించి మత
కల్లోలాలు సృష్టించటం కోసం ఉగ్రవాదాన్ని అడ్డంపెట్టుకున్నారని ఆరోపించారు. ఈ
టెర్రరిస్టు దాడులకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో వామపక్షాలు
బలహీన పడటం వల్ల, ప్రతిపక్షాలన్నా, ప్రజలన్నా,లెక్కలేని తనంతో కేంద్ర
ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఇప్పుడు దేశంలో వామపక్షాలు బలంగా లేని లోటును ప్రజలు
గుర్తిస్తున్నారని అన్నారు.
సీపీఎంలో పలువురి చేరిక
పుచ్చలపల్లి సుందరయ్య 40 వర్ధంతి సభ సందర్భంగా సభ్యులు పోతినేని సుదర్శన్, నున్న నాగేశ్వర రావు గారి సమక్షంలో టేకులపల్లి ప్రాంతానికి చెందిన చిలకల వెంకటేశ్వర్లుతో పాటు మరి కొంత మంది పార్టీలో చేరారు. చిలకల వెంకటేశ్వర్లు గతంలో హవేలీ సిపిఎం పార్టీలో తురుకైన కార్యకర్తగా డివిజన్ స్థాయి నాయకుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా చిలకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కన్నతల్లి లాంటి పార్టీని, ఎర్రజెండాను తుది వరకు విడవబోనని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బొగ్గవీటి సరళ, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాస రావు, జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, పిన్నింటి రమ్య, తుమ్మ విష్ణువర్ధన్, పారుపల్లి ఝాన్సీ, ఎంఏ జబ్బార్, ఎస్కే మేరా సాహెబ్, ఎస్ నవీన్ రెడ్డి ,తాళ్లపల్లి కృష్ణ, బోడపట్ల సుదర్శన్, భూక్య శ్రీనివాస్, బత్తిన ఉపేందర్, ఎస్.కె నాగుల్ మీరా, వజినేపల్లి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు వెల్లంపల్లి వెంకట్రావు, యర్రా గోపి, గాలి వెంకటాద్రి కత్తుల అమరావతి పోతురాజు వెంకటి తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment