కలెక్టరైనా ... భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు

 

Collector Jithesh V Patil

  • పండండి మగ బిడ్డకు జన్మనిచ్చిన శ్రద్ధ జీతేష్ వి పాటిల్
  • పలువురుకు ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ జీతేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. తాను ఉన్నతమైన పదవిలో వున్నా, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా తన భార్యకు ఓ సాధారణ వైద్య విధాన పరిషత్ కు చెందిన కమ్యునిటీ హెల్త్ సెంటర్లో కాన్పు చేయించారు. కలెక్టర్ సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్ బుధవారం పండంటి మగ బిడ్డకు జన్మ నిచ్చారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా వున్నారు. కలెక్టర్ దంపతులకు ఇంతకు ముందు తోలి కాన్పులోనూ మగ బిడ్డ పుట్టాడు. సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్ కొంత కాలంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకొని, మందులు వాడుతున్నారు. డి.సి.హెచ్. ఎస్ డాక్టర్. రవిబాబు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం కలిగించడం కోసం కలెక్టర్ పాటిల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్యకు కాన్పు చేయించారు. కలెక్టర్ నిర్ణయాన్ని పలువురు అభినంధిస్తున్నారు.  

Collector Jithesh V Patil


Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే