పాఠశాలలో మంత్రి పొంగులేటి శ్రమదానం

Ponguleti Srinivas Reddy


  • మొక్కను నాటిన మీనాక్షి నటరాజన్

పాల్వంచ మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రమదానం చేశారు. పొంగులేటి స్వయంగా ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను ఎత్తి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి, మహబూబా బాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావు పేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Meenakshi Natarajan




Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే