Posts

Showing posts from April, 2025

సీఎంఆర్ఎఫ్ క్రింద రూ. 1070 కోట్ల ఆర్థిక సహాయం

Image
  రాష్ట్ర రెవెన్యూ , హౌజింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి 71 మంది లబ్ధిదారులకు రూ. 23 . 33 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 35 మందికి ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల చొప్పున కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత రాష్ట్రంలోని నిరుపేదలకు వైద్య సహాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో 1070 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని రాష్ట్ర రెవెన్యూ , హౌజింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన కూసుమంచి క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 23 లక్షల 33 వేల రూపాయలు , 35 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల చొప్పున కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ   చేసారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పేద వాడికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. ఆనాడు పాలించిన పాలకులు 10 సంవత్సరాలలో వైద్యం పట్ల ఎప్పుడూ తామిచ్చిన నిధులు ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలోనే   ముఖ్యమంత్ర...

కేంద్రం ముస్లింల హక్కులను కాల రాసింది

Image
  వెంటనే వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలి ఆర్పీవీ అధ్యక్షులు సాధిక్ అలి డిమాండ్ ఖమ్మంలో ఆర్పీవీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం 2025 ను తీసుకు వచ్చి ముస్లింల హక్కులను కాల రాసిందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ సాధిక్ అలి విమర్శించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్   లా బోర్డ్ చేపట్టినకార్యక్రమాలకు మద్దతుగా ఖమ్మంలో బుధవారం రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ క్రాస్ రోడ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కాల్వ ఒడ్డు , మయూరిసెంటర్ , పాత   ఎల్ఐసి ఆఫీస్ మీదుగా జడ్పీ సెంటర్లోని   డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకూ సాగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి , ప్ల కార్డులు పట్టుకొని వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాధిక్ అలి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల పట్ల వివక్షత చూపడంతో పాటు విభజించి పాలించే నైజాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక ఏళ్లుగా ప్రదర్శిస్తూ వస్తుందన్...

ఇన్ టైంలో ఎరువులు, విత్తనాలు అందించాలి

Image
  పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సరైన సమయంలో రైతులకు ఎరువులు , విత్తనాలు అందించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వ్యవసాయ అధికార్లను కోరారు. బాధవారం ఆయన మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గ పరిధిలోని వ్యవసాయ అధికార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ ఈ సీజన్లో రైతులకు ఏది అవసరమో దానిపై దృష్టి సారించాలని సూచించారు. రైతులతో సంబంధాలను పెంచుకోవాలని , ఎప్పటికప్పుడు వ్యవసాయానికి అవసరమైన సూచనలు చేయాలన్నారు. వారికి ఏ కష్టం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని కోరారు. రైతుల అభివృద్ది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందన్నారు. రైతు భరోసా , రైతు ఋణ మాఫీ , రైతు భీమా , సన్న వడ్లకు రూ. 500 బోనస్ వంటి వథకాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఏడీఏ తాతారావు తదితరులు పాల్గొన్నారు. Janechcha

ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా ఆహ్వానించాలి

Image
  అధికార్లకు మంత్రి తుమ్మల క్లాస్ ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలను వ్యక్తి గతంగా ఆహ్వానించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికార్లను ఆదేశించారు. మీ లాప్స్ వల్ల ప్రభుత్వం అబాసు పాలు కాకూడదన్నారు. మంగళవారం అశ్వరావు పేట నియోజక వర్గంలోని పూసుకుంటలో రూ.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు శంఖుస్థాపన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణను అధికార్లు పిలువక పోవడంతో , జారే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నిరాకరించారు. అనంతరం , అదే గ్రామంలో మంత్రి తుమ్మలతో కలిసి రూ. 4 .16 కోట్లతో నిర్మించిన మూడు హై లెవెల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఎవరికిచ్చే గౌరవం వారికివాలన్నారు. జిల్లా కలెక్టర్ అధికారిక కార్యక్రమాలను ఖరారు చేసిన తర్వాత , ఆ సమాచారాన్ని సంబంధిత శాఖల అధికార్లు , స్థానిక సర్పంచ్ దగ్గర నుండి ఆ పరిధిలోని ప్రజా ప్రతినిధిలందరికీ అందజేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వడంతో పాటు వ్యక్తి గతంగా కలిసి ఆహ్వానించాలన్నారు. భవిష్యత్ లో ఎటువంటి పొరపా...

సారీ సార్ ... నేనొప్పుకొను

Image
  మంత్రి తుమ్మల ప్రోగ్రాంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఫైర్ తనకు తెలియకుండా ప్రోగ్రాం ఎలా పెడతారంటూ అధికార్లపై ఆగ్రహం తుమ్మల వారించినా ... సారీ సార్ ... నాకు అవసరం లేదంటూ తిరష్కరణ ఆగి పోయిన రూ. 15 కోట్ల విలువైన బీటీ రోడ్డు నిర్మాణ పనుల శంఖుస్థాపన   అధికార పార్టీకి చెందిన అశ్వరావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికార్లపై మండి పడ్డారు. నియోజక వర్గంలో తనకు తెలియ కుండా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటన ఖరారు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల సమక్షంలోనే జిల్లా అధికార్లను నిలదీశారు. “ నాకు మీరు చెప్పాలి గదా ? నాకు చెప్పారా ? టూర్ షెడ్యూల్ ఏమైనా చెప్పారా నాకు ? నేనొక ఎమ్మెల్యేని మీరు నాకు చెప్పారా ? చెప్ప లేదు గదా ? ఎందుకు చెప్ప లేదు ? ఎమ్మెల్యే ఉన్నాడనుకున్నారా ?   లేదా ? చచ్చాడనుకున్నారా ? ఎమ్మెల్యే పిచ్చోడిలా కనిపిస్తున్నాడా ? ” అంటూ ఆగ్రహంతో ఊగి పోయారు. తుమ్మల వారించినా విన లేదు. సారీ సార్ ... నాకవసరం లేదంటూ ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిరాకరించారు. అశ్వరావు పేట నియోజక వర్గంలోని దమ్మపేట మండలంలో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు , స్థానిక ఎ...

భూ నిర్వాసితులకు మెరుగైన నష్ట పరిహారం

Image
  భూ సేకరణకు సహకరించండి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వ పరిధిలో మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్పారు. అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని కోరారు. సోమవారం ఖమ్మం ఆర్డీవో కార్యాలయం లోని నేషనల్ హైవే ప్రాజెక్ట్ భూ సేకరణ బాధితులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చింతకాని మండలంలోని కోదుమూరు , వందనం గ్రామాల్లో భూసేకరణ జరిగే భూ యజమానులు , రైతులతో నష్టపరిహారంపై చర్చించారు. అయితే , రైతులు తమ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే జాతీయ రహదారి సూర్యాపేట దేవరపల్లి రోడ్డు వల్ల పొలాలు నష్ట పోయామని , అదే విధంగా గ్రామాల నుండి అమరావతి నాగపూర్ రోడ్డు రావడం వల్ల గ్రామంలో చిన్న సన్న కారు రైతులు భూములు పూర్తిగా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిలో ఉన్న పైపులు , కట్టడాలు , ఇప్పుడు ఉన్న పంటలు , సుబాబులు , జామాయిలు చెట్లలను నష్ట పోవాల్సి వస్తుందన్నారు. సర్వే చేసి అవార్డు కాపీ పాస్ చేసిన తర్వాతే ,   తాము కూడా సహకరిస్తామని రైతులు అన్నారు. రైతుల సమస్య...

కొత్త వారొస్తే సమాచారమివ్వండి

Image
  ఇల్లెందు డిఎస్పీ చంద్రభాను బూస్రాయిలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు గ్రామంలోకి ఎవరైనా కొత్త వారొస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇల్లెందు డిఎస్పీ చంద్రభాను కోరారు. సోమవారం ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొత్తి కోయ గ్రామమైన బూస్రాయిలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు.   అంతకు ముందు ఆయన గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రభాను గ్రామస్తులతో మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ శాఖ తరపున సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని మారు మూల ప్రాంతాల్లో నివసించే ఆదీవాసీ ప్రజలకు విద్య , వైద్యం , రవాణా వంటి సౌకర్యాలను అందించడంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎల్ల వేళలా ముందుంటారని , ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ గ్రామంలోని యువత మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ సురేష్ , ఎస్సై సోమేశ్వర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Janechcha

ధరణిలా స్వార్ధంతో తెచ్చిన చట్టం కాదు ‘ భూ భారతి ’

Image
  భూ సమస్యల పరిష్కారానికి ఐదంచేల వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనన్ని ట్రిబ్యున‌ల్స్ ఏర్పాటు సీసీఎల్ఎలో పరిష్కారం కాక పోతే ట్రిబ్యున‌ల్స్ కు వెళ్లొచ్చు గులాబి రంగు కార్యకర్తలకు భూమి లేక పోయినా పాస్ పుస్తకాలిచ్చారు సక్రమం కాని అక్రమాలపై చర్యలు తప్పవు భూ భారతిలో అన్ని సమస్యలకు శాశ్విత పరిష్కారం రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ భారతి చట్టంలో ప్రతి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని , ధరణిలా ఇది నాలుగు గోడల మధ్య తెచ్చిన స్వార్ధ పూరిత చట్టం కాదని తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం , సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం   శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ చ‌ట్టం చేసే ముందు రైతుల క‌ష్టం గురించి ఆలోచించి , ప్రత్యేక క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. ఆ క‌మిటీ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని రైతులకు శ్రీ‌రామ‌ర‌క్షగా నిలిచే భూ భార‌తి - 2025 చ‌ట్టాన్ని రూపొంద...

ఎస్ఎఫ్ఐ ఓ విశ్వవిద్యాలయం

Image
సంఘం ద్వారా దేశానికి ఎంతో మంది నిష్ణాతులు లౌకిక తత్వంపై మాట్లాడితే యూనివర్సిటీల నుంచి సస్పెన్షన్ ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్ ముగిసిన ఎస్ఎఫ్ఐ ఐదవ రాష్ట్ర మహాసభలు 17 అంశాలపై తీర్మానాలు , నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక ఎస్ఎఫ్ఐ ఓ విశ్వవిద్యాలయం లాంటిదని ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్ అన్నారు. స్వాతంత్ర్యం , ప్రజాస్వామ్యం , సోషలిజం పునాదులపై ఇది నిర్మితమైందన్నారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం ( సీతారాం ఏచూరి నగర్ )లో మూడు రోజులు పాటు కొనసాగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదవ మహాసభలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు నితీష్ నారాయణ్ మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతోందని , సెక్యులరిజంపై మాట్లాడినందుకు స్కాలర్స్ ను యూనివర్సిటీల నుంచి బహిష్కరిస్తోందని అన్నారు. విద్యార్థి సమస్యలపై ప్రశ్నించినందుకు విద్యార్థి నేతలపై దేశద్రోహం కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. లౌకిక విధానంపై మాట్లాడినందుకు టీఐఎస్ఎస్ రీసెర్చ్ స్కాలర్ రాందాస్ పై రెండేళ్లు వేటు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ హెచ్ సీయూ భూముల కాజేస్తున్నారని వి...

బీఆర్ఎస్ వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

Image
  వాగ్వాదానికి దిగిన తాతా మధు , సండ్ర , కందాల రోడ్డుపై బైటాయించిన మాజీ మంత్రి పువ్వాడ వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళుతున్న వాహనాలను పాలేరు నియోజక వర్గంలోని తిరుమలాయ పాలెం వద్ద ఆదివారం పోలీసులు తనిఖీ చేశారు. కార్యకర్తలు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సులను నిలిపి వేయడంతో , పార్టీ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు , మాజీ ఎమ్మేల్యేలు సండ్ర వెంకట వీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపటకు అక్కడ నుండి బస్సులను వదిలి వేశారు. ఆ తర్వాత , తిరుమలాయ పాలెం పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలను నిలిపి వేస్తున్నట్లు సమాచారం అందడంతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ కొద్ది సేపు అక్కడే బైటాయించారు. పోలీసులతో మాట్లాడి బస్సులను అక్కడ నుండి సభకు పంపించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా , సభను అడ్డుకో లేదన్నారు. తనిఖీల పేరుతో సభకు వెళ్ళే బస్సులను ఆపడం సరైంది కాదన్నారు. Janechcha

త్వరలో అన్ని కార్పోరేషన్లకు నియామకాలు

Image
  కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అబ్జర్వర్లు రాజేందర్ రెడ్డి , బత్తిన శ్రీనివాస రావు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం లో భాగంగా ఖాళీగా ఉన్న అన్ని కార్పొరేషన్ సంస్థలకు త్వరలో అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు ఖమ్మం జిల్లా పీసీసీ అబ్జర్వర్లు నాయిని రాజేందర్ రెడ్డి , బత్తిన శ్రీనివాస రావు చెప్పారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అధ్యక్షతన బ్లాక్ , మండల , పట్టణ అధ్యక్షులు , ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ , మండల , పట్టణ , బ్లాక్ స్థాయి కమిటీలకు సుమారు ఐదుగురి పేర్లతో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వారు పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడి పని చేసే వారై వుండాలన్నారు. పార్టీ పదవులలో ఉండి పార్టీ కోసం పని చేయాలని , పని చేయలేనివారు స్వచ్ఛందంగా తప్పుకోవాలని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో అందరూ భాగస్వాములై ఈ ప్రక్రిను త్వరిత గతిన పూర్తి చేసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల సత్తా చాటాలని కోరారు. అనంతరం రాష్ట్ర జై బాపు...

ఎస్ఎఫ్ఐ విద్యార్థి సమస్యల పరిష్కారానికే పరిమితం కావొద్దు

Image
  సైద్ధాంతిక భావ జాలాన్ని పెంపొందించాలి తరగతి గదిని సమాజాన్ని అనుసంధానించాలి ఆచరణ కోసం అధ్యయనం చేయాలి సంపదకు బదులు మోడీ దారిద్ర్యం పెంపు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల్లో ప్రొఫెసర్ నాగేశ్వ ర్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సమస్యల పరిష్కారానికే పరిమితం కాలేదని , కాకూడదని ప్రముఖ విశ్లేషకులు , ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. వర్గ చైతన్యం ఇచ్చే సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు. విద్యాపరమైన అసమానతలే ఆదాయ పరమైన అసమానతలకు దారి తీస్తాయని , ధనిక , పేద అంతరాలను దాటి విద్యార్థి ఉద్యమాలను నిర్మించాలని పిలుపు నిచ్చారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం ( సీతారాం ఏచూరి నగర్) లో కొనసాగుతున్న ఐదవ రాష్ట్ర మహాసభల్లో నాగేశ్వర్ శనివారం ప్రారంభోపన్యాసం చేశారు. ఏ సిద్ధాంతమైనా ఆచరణ నుంచి రావాలని , ఆచరణ కోసం అధ్యయనం చేయాలని సూచించారు.   ఆలోచనల పోరాటంలో ఎస్ఎఫ్ఐ ముందుండాలన్నారు. విద్యార్థుల దైనందిన సమస్యలను ప్రాపంచిక దృక్పథంతో అనుసంధానం చేయాలని చెప్పారు. ప్రజా ఉద్యమాలకు కీలక నాయకులను ఇచ్చింది ఎస్ఎఫ్ఐ అని పేర్కొన్నారు. అనేక సంస్థలకు నిష్ణాతులను ఇచ్చిందీ ఈ సంఘమేనన్నారు. దేశ ఐక్యతకు వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టింది కూ...

ఉగ్రదాడి భద్రతా వైఫల్యమే

Image
  మోడీ , అమిత్ షాకు పదవుల్లో కొనసాగే అర్హత లేదు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే విద్యార్థి నేతలపై వేటు హిందూ..హిందుస్థానీ అంటూ పాఠ్యపుస్తకాల్లో మార్పు నయా ఫాసిస్టు విధానాలపై పోరాటం ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు వీపీ సాను ఖమ్మంలో ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 5వ మహాసభలు ఖమ్మం నగర వీధుల్లో విద్యార్ధుల భారీ ర్యాలీ కాశ్మీర్లో పర్యాటకులపై దాడికి భద్రత వైఫల్యమే కారణమని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను అన్నారు. పార్లమెంటు మొదలు పుల్వామా వరకు అనేక చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయని , ప్రధానిగా మోడీ , హోం మినిస్టర్ గా అమిత్ షాకు కొనసాగే అర్హత లేదన్నారు. ఖమ్మంలో మూడు రోజుల పాటు జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదవ మహాసభలు స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రం ( సీతారాం ఏచూరి నగర్ )లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్. మూర్తి అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమయ్యాయి. దీనికి ముందు కళా క్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీపీ సాను మాట్లాడుతూ పెహల్ గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చారంటే , ఇది పూర్తిగా భద్రత వైఫల్యమేనన్నారు. నరేంద్ర మోడీ , బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారని ...