ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా ఆహ్వానించాలి

 

Thummala Nageswara Rao

  • అధికార్లకు మంత్రి తుమ్మల క్లాస్

ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలను వ్యక్తి గతంగా ఆహ్వానించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికార్లను ఆదేశించారు. మీ లాప్స్ వల్ల ప్రభుత్వం అబాసు పాలు కాకూడదన్నారు. మంగళవారం అశ్వరావు పేట నియోజక వర్గంలోని పూసుకుంటలో రూ.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు శంఖుస్థాపన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణను అధికార్లు పిలువక పోవడంతో, జారే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నిరాకరించారు. అనంతరం, అదే గ్రామంలో మంత్రి తుమ్మలతో కలిసి రూ. 4 .16 కోట్లతో నిర్మించిన మూడు హై లెవెల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఎవరికిచ్చే గౌరవం వారికివాలన్నారు. జిల్లా కలెక్టర్ అధికారిక కార్యక్రమాలను ఖరారు చేసిన తర్వాత, ఆ సమాచారాన్ని సంబంధిత శాఖల అధికార్లు, స్థానిక సర్పంచ్ దగ్గర నుండి ఆ పరిధిలోని ప్రజా ప్రతినిధిలందరికీ అందజేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వడంతో పాటు వ్యక్తి గతంగా కలిసి ఆహ్వానించాలన్నారు. భవిష్యత్ లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అధికార్లు పని చేయాలని ఆదేశించారు. ఈ సభలో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.  

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు