త్వరలో అన్ని కార్పోరేషన్లకు నియామకాలు

 

Congress

  • కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అబ్జర్వర్లు రాజేందర్ రెడ్డి, బత్తిన శ్రీనివాస రావు

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం లో భాగంగా ఖాళీగా ఉన్న అన్ని కార్పొరేషన్ సంస్థలకు త్వరలో అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు ఖమ్మం జిల్లా పీసీసీ అబ్జర్వర్లు నాయిని రాజేందర్ రెడ్డి, బత్తిన శ్రీనివాస రావు చెప్పారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అధ్యక్షతన బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, మండల, పట్టణ, బ్లాక్ స్థాయి కమిటీలకు సుమారు ఐదుగురి పేర్లతో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వారు పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడి పని చేసే వారై వుండాలన్నారు. పార్టీ పదవులలో ఉండి పార్టీ కోసం పని చేయాలని, పని చేయలేనివారు స్వచ్ఛందంగా తప్పుకోవాలని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో అందరూ భాగస్వాములై ఈ ప్రక్రిను త్వరిత గతిన పూర్తి చేసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల సత్తా చాటాలని కోరారు. అనంతరం రాష్ట్ర జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అభియాన్ కో ఆర్డినేటర్ పులి అనిల్ కుమార్ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై మాట్లాడారు. ఈ సమావేశంలో సత్తుపల్లి శాసనసభ సభ్యులు మట్టా రాగమయి, వైరా నియోజకవర్గ శాసనసభ సభ్యులు మాలోత్ రాందాసు నాయక్, మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వర రావు, పాలేరు నియోజకవర్గ జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అభియాన్ కో ఆర్డినేటర్, రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గ జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అభియాన్ కో ఆర్డినేటర్ మన్నే సతీష్, రాష్ట్ర చేనేత, హస్త కళల అభివృద్ధి చైర్మన్ నాయుడు సత్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ దొండపాటి వేంకటేశ్వర రావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటి మేయర్ ఫాతిమా ముక్తార్ జోహార, పీసీసీ అధికార ప్రతినిధి కొరివి వెంకటరత్నం, సిటీ కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు మహ్మద్ జావేద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల  దీపక్ చౌదరి, ,జిల్లా అనుబంధ సంఘాల అద్యక్షులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, వేజెండ్ల సాయికుమార్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, పుచ్చకాయల వీరభద్రం, మొక్క శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు