ఇన్ టైంలో ఎరువులు, విత్తనాలు అందించాలి
- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
సరైన సమయంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాలని పినపాక ఎమ్మెల్యే పాయం
వెంకటేశ్వర్లు వ్యవసాయ అధికార్లను కోరారు. బాధవారం ఆయన మణుగూరులోని తన క్యాంపు
కార్యాలయంలో నియోజక వర్గ పరిధిలోని వ్యవసాయ అధికార్లతో సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా పాయం మాట్లాడుతూ ఈ సీజన్లో రైతులకు ఏది అవసరమో దానిపై దృష్టి సారించాలని
సూచించారు. రైతులతో సంబంధాలను పెంచుకోవాలని, ఎప్పటికప్పుడు వ్యవసాయానికి
అవసరమైన సూచనలు చేయాలన్నారు. వారికి ఏ కష్టం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని
కోరారు. రైతుల అభివృద్ది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీఠ
వేస్తుందన్నారు. రైతు భరోసా, రైతు ఋణ మాఫీ, రైతు భీమా, సన్న వడ్లకు రూ. 500 బోనస్ వంటి వథకాలను అమలు
చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఏడీఏ తాతారావు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment