బీఆర్ఎస్ వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు
- వాగ్వాదానికి దిగిన తాతా మధు, సండ్ర, కందాల
- రోడ్డుపై బైటాయించిన మాజీ మంత్రి పువ్వాడ
వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళుతున్న వాహనాలను పాలేరు నియోజక వర్గంలోని
తిరుమలాయ పాలెం వద్ద ఆదివారం పోలీసులు తనిఖీ చేశారు. కార్యకర్తలు ప్రయాణిస్తున్న ప్రైవేట్
బస్సులను నిలిపి వేయడంతో, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మేల్యేలు
సండ్ర వెంకట వీరయ్య, కందాల
ఉపేందర్ రెడ్డి అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపటకు అక్కడ
నుండి బస్సులను వదిలి వేశారు. ఆ తర్వాత, తిరుమలాయ పాలెం పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలను నిలిపి
వేస్తున్నట్లు సమాచారం అందడంతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హుటాహుటిన సంఘటనా
స్థలానికి చేరుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ కొద్ది సేపు అక్కడే
బైటాయించారు. పోలీసులతో మాట్లాడి బస్సులను అక్కడ నుండి సభకు పంపించారు. ఈ
సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, సభను అడ్డుకో
లేదన్నారు. తనిఖీల పేరుతో సభకు వెళ్ళే బస్సులను ఆపడం సరైంది కాదన్నారు.
Comments
Post a Comment